- ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
జ: చిగుళ్ళు నొప్పి, చిగుళ్ళ నుంచి రక్తం కారడం, కొరికినప్పుడు పళ్ళు కదలడం, పళ్ళు చిగుళ్ళ మధ్య చీము కారడం తదితర సమస్యలతో బాధపడుతున్నప్పుడు చిగుళ్ళు ముడుచుకుపోతుంటాయి. జింజివైటిస్ కారణముగా ఇలా ముడుచుకపోవడంవల్ల నోటి దుర్వాసన వస్తుంది. మధుమేహ వ్యాధి ఉన్నవారిలో నోటిదుర్వాసన ఎక్కువగా ఉంటుంది. చిగుళ్ల వ్యాధులు, దంతాల మధ్య పాచిపేరుకోవటం వంటివి కూడా ముఖ్యకారణాలే.. గొంతు నందలి ఇన్ఫెక్షన్ మరియు పళ్ళ యందలి వాపు కారణంగా ఎర్పడిన చీము మరియు రక్తము అక్కడ నిలిచి, కుళ్ళి ధుర్గంధమైన వాసనను కలిగించును... నోటి నుండి దుర్వాసన రాకుండా ఉండాలంటే ప్రతిరోజు రెండు పూటలా బ్రష్ చేసుకోవాలి. ఏడాదిలో కనీసం రెండుసార్లు అయినా దంత వైద్యుణ్ణి సంప్రదిస్తూ ఉండాలి.
- =================================================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.