Q : నా వయసు ముప్ఫై. ఈ మధ్యే పెళ్లయ్యింది. పండగలు, ప్రత్యేక సందర్భాల్లాంటివి ఉన్నప్పుడు నెలసరి వాయిదా వేసేందుకు అప్పుడప్పుడు మాత్రలు వేసుకోవడం పెళ్లికి ముందు నుంచీ నాకలవాటు. అయితే దానివల్ల నెలసరి సక్రమంగా రావడంలేదు. మాత్రలు వేసుకోవడమే దీనికి కారణమా. అసలు అలాంటి మాత్రలు వేసుకోవచ్చా?
A : నెలసరిని వాయిదా వేసే మాత్రల్ని సాధ్యమైనంతవరకు వాడకపోవడం అన్నివిధాలా మంచిది. మరీ తప్పనిసరైతే.. ఓ పద్ధతి ప్రకారం, వైద్యుల సలహాతో వాడాల్సి ఉంటుంది. నెలసరి రావాల్సిన తేదీకి ఐదురోజుల ముందు నుంచీ ఈ మాత్రల్ని రెండు పూటలా ఒకే సమయానికి వేసుకోవాల్సి ఉంటుంది. ప్రతినెలా నెలసరి సక్రమంగా వచ్చేవాళ్లకి వర్తిస్తుందిది. అప్పుడే శరీరంలోని హార్మోన్లు సమతుల్యతను కోల్పోకుండా ఉంటాయి. వైద్యుల సలహా లేకపోయినా, మరీ ఎక్కువ లేదా తక్కువ మోతాదులో, రుతుక్రమానికి మరీ ముందు లేదా ఆలస్యంగా తీసుకున్నా.. హార్మోన్ల అసమతుల్యత ఎదురయ్యే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడే ఇతర సమస్యలు ఎదురవుతాయి. హార్మోన్లలో తేడా చోటుచేసుకున్నప్పుడు కలిగే ఒత్తిడి.. నెలసరి ఆలస్యంగా వచ్చేందుకు కారణమవుతుంది. మీ సమస్య కూడా అదే. కాబట్టి ఏ మాత్రను ఎంత మోతాదులో అన్నది వైద్యుల సలహాతో వాడండి. వైద్యులు చెప్పినట్లు వాడితే.. ఎలాంటి సమస్యలు ఉండవు.
==================================
visit my website - > Dr.Seshagirirao-MBBS
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.