Q : నా వయసు ఇరవైఎనిమిది. ఆర్నెల్లక్రితం పెళ్లయ్యింది. నా భర్తకు లైంగిక ఇన్‌ఫెక్షన్ ఉండటంతో అది నాకూ సంక్రమించింది. వైద్యులు పరీక్షలు చేసి హెర్పిస్ అన్నారు. మందులూ సూచించారు. ఇప్పుడు గర్భం దాల్చాలనుకుంటున్నా. ఈ సమస్య ప్రభావం పుట్టబోయే బిడ్డపై ఉంటుందా?.
A : మీ సమస్యను హెర్పిస్ టాలిస్ అంటారు. భార్యాభర్తల్లో ఒకరిలో లైంగిక ఇన్‌ఫెక్షన్ ఉన్నా.. ఇద్దరూ మందులు వాడటం తప్పనిసరి. ఇది ఒక్కసారి వస్తే.. రోగనిరోధక శక్తి తగ్గినప్పుడల్లా దాని లక్షణాలు మళ్లీ కనిపిస్తాయి. అలాంటప్పుడు మళ్లీ మందులు వాడాల్సి ఉంటుంది. ఆ ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడు గర్భం ధరించకపోవడమే మంచిది. ఎందుకంటే.. గర్భధారణ సమయంలో ఆ లక్షణాలు మళ్లీ మొదలై.. గర్భస్రావం కావచ్చు. పుట్టబోయే బిడ్డలోనూ అవకరాలు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ వ్యాధి లక్షణాలు తగ్గాయని నిర్థారించుకున్నాకే గర్భం ధరించడం అన్నివిధాలా మేలు. అంతేకాదు.. కలయిక సమయంలోనూ కండోమ్ వాడటం వల్ల లక్షణాల తీవ్రతను తగ్గించవచ్చు.
వైద్య రంగము లో ఈ వ్యాది వ్యాప్తి అరికట్టేందుకు గాని , నివారించేదుకు గాని సరియైన మందులు లేవు . ముందు జాగ్రతా(prevention) , సురక్షిత సంపర్కమే (safe sex) ముఖ్యమైనవి .
ఈ క్రింది మందులు కొంతవరకు వ్యాధి తీవ్రతను , వ్యాప్తిని , నివారణకు తోడ్పడును :->
Acyclovir (herpex, acivir)-- 200 to 400 mg tablet four times/day,+Omintmet
val acyclovir(Valtres, Zelitres), same dose.
famiciclovir .
- ====================================
visit my website - > Dr.Seshagirirao-MBBS
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.