Q : నాకు యాభైఅయిదేళ్లు. కొన్ని కారణాల వల్ల ఏడాది క్రితం గర్భసంచిని తొలగించారు. అయితే నాలుగు నెలలుగా అప్పుడప్పుడు రక్తస్రావం కనిపిస్తోంది. జననేంద్రియాల దగ్గర విపరీతమైన నొప్పి, మంట కూడా బాధిస్తున్నాయి. ఇదేమైనా ప్రమాద సంకేతమా. ఇతర సమస్యలేమైనా వస్తాయని భయంగా ఉంది.
A : గర్భాశయాన్ని తొలగించాక నెలసరి ఆగిపోతుంది. దాంతో రక్తస్రావం కాకూడదు. మీకు అప్పుడప్పుడు అవుతోందంటే.. హార్మోన్ల లేమి, కొన్నిరకాల ఇన్‌ఫెక్షన్లు, శస్త్రచికిత్స తరవాత కుట్లు సరిగ్గా అతుక్కోకపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్య ఎదురుకావచ్చు. చాలా అరుదుగా మాత్రం క్యాన్సర్ కావచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. చిన్నచిన్న ఇన్‌ఫెక్షన్లే అయితే.. మందులు వాడితే సరిపోతుంది. కాబట్టి భయపడాల్సిన అవసరంలేదు.
- .==========================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.