ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
ప్ర : మెనోపాజ్ తరువాత ఎటువంటి వైద్యపరీక్షలు అవసరము ?
జ : మెనోపాజ్ తరవాత సర్వసాధారణము గా ఈస్ట్రోజన్ లెవల్స్ తక్కువ అవడము వలన ... నీరసము , ఆయాసము , విసుగు ,నిద్రపట్టక పోవడము ఉంటాయి. ఇవన్నీ ప్రమాదకరమైనవి కావు . కొన్ని వయసు తో వచ్చే ప్రమాధకరమైన వ్యాదులను దృష్టిలో పెట్టుకోవాలి. అవి -- >
- పెల్విక్ పరీక్ష : దీనిలో స్త్రీ వైద్యనిపుణులు సెర్వైకల్ క్యాన్సర్ సంబంధిత తనికీలు చేస్తారు.
- బ్రెస్ట్ పరీక్ష : ఇందులో కూడా రొమ్ము కణితలు , గడ్డలు విషయమై పరీక్షలు చేస్తారు.
- పాప్ స్మియర్ : ఏడాది కొకసారి చేయించుకుంటే మంచిది. క్యాన్సర్ జబ్బులు ముందుగానే పసిగట్టవచ్చును.
- మెమ్మోగ్రామ్ పరీక్ష : రొమ్ము క్యాన్సర్ ముందుగానే గుర్తించవచ్చును.
- రక్తపోటు : బి.పి. రికార్డ్ చేయడము వలన ప్రమాదకరమైన ఎన్నో ఉపద్రవాలను ఎదుర్కోవచ్చు.
- మదుమేహము : సుగర్ తనికీ చేయించుకుంటే సరైన సమయము లో మంచి చికిత్స పొందవచ్చు
- థైరాయిడ్ : ఇవి అంతగా ముఖ్యము కాకపోయినా ... బారీ కాయము గలవారు థైరాయిడ్ ఫంక్షన్ పరీక్షలు చేయించుకుంటే మంచిది.
- లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు : కొవ్వు శాతము , మంచి , చెడు కొలెస్టిరాల్ తెలుసుకోవడం వలన జీవితకాలము పొడిగించవచ్చు .
===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.