ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
ప్ర : స్మోకింగ్ వలన చర్మము ప్రభావితం అవుతుందా? తెలియజేయండి ?
జ : ఖచ్చితము గా ప్రభావితం అవుతుంది . స్మోకింగ్ చర్మానికి పోషకాలు , ఆక్షిజన్ సరఫరా చేసే రక్తనాళాలను కుంచింపజేస్తుంది. దీనివల్ల చర్మము " హైఫోక్షియా" అనే దశకు చేరుతుంది. ఒక్క సిగరెట్ స్మోకింగ్ చర్మ రక్తనాళాలను దాదాపు ఓ గంటపాటు కుచింపజేయగలదు .
సాధారణముగా స్మోకర్లు ప్రతి గంటా రెండు గంటలకు ఓ సిగరెట్ తాగుతుంటారు. కాబట్టి పొగతాగే వారి చర్మము దాదాపు రోజంతా హైపోక్షిక్ అవుతుంది .ఇలా కొన్నాళ్ళు గడిచేకొద్దీ చర్మము మెరుపును మృదుత్వాన్ని కో్ల్పోతుంది. స్మొకింగ వల్ల ఉత్పత్తి అయ్యే హైపోక్సియా వల్ల చర్మము కొలాజెన్ , ఎలాస్టిన్ పైబర్లకు కూడం నష్టము జరుగుతుంది . చర్మము మందము తగ్గిపోయి ఎలాస్టిసిటి కోల్పోతారు. పొగతాగే వారి చర్మము పొగతాగనివారి చర్మము కంటే 25 శాతము పల్చగా ఉంటుంది. పల్చని చర్మము నెమ్మదిగా సాగిపోవడము మొదలు పెట్టి 5 ఏళ్ళు ఎక్కువ వయసు పైబడిన వారిలా కనబడుతారు. చర్మము హీలింగ్ , పునరుజ్జీవ శక్తులు కూడా ప్రభావితము అవుతాయి. పొగతాగే వారికి గాయాలు , పుళ్ళు నెమ్మదిగా నయమవుతాయి. గోళ్ళు , పెదాలు నల్ల బడతాయి. నికొటిన్ వేళ్ళు పసుపు బారినట్లు ఉంటాయి. సోరియాసిస్ , లెగ్ అల్సరేషన్ సమస్యలు ఇటువంటివారికి ఎక్కువ .
- ===========================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.