ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును. ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
ప్ర : నాకు 30 ఏళ్ళు రెండేళ్ళ క్రితం వరకూ ఋతుక్రమము ఖచ్చితము గా వచ్చేది. తర్వాత ఇర్రెగ్యులర్ గా అయి పూర్తిగా ఆగిపోయాయి. పరీక్షలు చేయించుకున్నాను. నా ఓవరీలు సాధారణము గా పనిచేయడము లేదని వైద్యులు తెలిపారు. గత నాలుగేళ్ళుగా గర్భం కోసము ప్రయత్నిస్తున్నా. ఏదైనా మార్గము ఉందా? .
జ : బహుశా మీకు "ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫయిల్యూర్ (premature overian failure)" కావచ్చు . కొందరు మహిళలకు పరిమిత సంఖ్యలో అండాలుంటాయి. ఇవి ఎగ్జాస్ట్ అయ్యాక ఓవరీల పనితీరు ఆగిపోతుంది. మీకు కొన్ని హార్మోనల్ , జెనెటికల్ పరీక్షలు అవసరము . మంచి సంతానసాఫల్య కేంద్రాన్ని సంప్రదించండి . అప్పుడే మీ పరిస్థితికి కారణము గుర్తించే వీలుంటుంది. డోనర్ ఎగ్ .. మీ భర్త వీర్యము ద్వారా " ఐ.వి.ఫ్." పద్దతిలో మీరు గర్భము దాల్చే ఏకైక మార్గము ఉంది. ఇది సంతృప్తికరమైన పరిష్కారము .
- ===========================
visit my website - >
Dr.Seshagirirao-MBBS -
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.