ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
ప్ర : హాయిగా నిద్ర పోతే ఆరోగ్యమంటారు . అదెలా?
జ : నిద్ర లేచి పలురోగాలకు కారణమవుతుంది. అలాగని బద్దకముగా అదే పనిగా నిదుర పోరాదు . ఏదైనా అతిగా చెయ్యడము అనర్ధమే కదా! నిద్రలెకపోతే ఏమవుతుంది ... మహా అయితే మరునాడు కునిపాట్లు తప్పవు అనుకుంటే పొరపాటే . రోజుకి సరాసరి 8 గంటలు నిద్ర పోవాలి. ఇది మెదడుకు విశ్రాంతి నిచ్చి దాని పనితములో చురుకుతనము పెంపొందిస్తుంది.
నిద్ర చాలి నంత లేకపోవడము వల్ల జీర్ణవ్యవస్థ క్రమబద్దీకరణ , గ్లూకోజ్ మెటబాలిజం , రక్తపోటు , మధుమేహము వంటి ముఖ్యమైన శారీరక పనితీరు ప్రభావితమువుతుందని చికాగో పరిశోధకులు పేర్కొన్నాయి. నిద్రపై ప్రయోగాత్మక , పరిశీలనాత్మక అధ్యయనాలు జరిపి ఈ విషయాన్ని గుర్తించారు. ఆరు గంటలకంటే తక్కువ సేపు నిద్రపోవడము వల్ల బాడీమాస్ ఇండెక్ష్ (BMI) , స్థూలకాయము పెరుగుతుందని లేలింది. చాలినంత నిద్రలేకపోవడము వల్ల " ఘ్రెలిన్ " అనే హార్మొనులు ఉత్పత్తి ప్రభావితం అవుతాయని తేలినది . దీనివలన ఆకలి పెరుగు తుంది . ఫలితముగా ఆహారము అధికము గా తీసుకోవడము... బరువు పెరగడము జరుగుతాయి.
నిద్ర లేమి వల్ల గ్లూకోజ్ మెటబాలిజం అసంబద్ధత , రక్తపోటు పెరుగుతాయి. ఈ ప్రబావాలు పిల్లలలోనూ , యుక్తవయస్కులలోనూ ఎక్కువగా కనిపిస్తాయి. అర్ధరాత్రి వరకు నిద్రలేకుండా టి.వి లు చూసేవారు , కంఫ్యూటర్లు పైన పనిచేసేవారు ఎక్కువగా గురు అవుతారు.
- ===========================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.