ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
ప్ర : నావయస్సు 49 సం.లు . నా పనిమీద ఏకాత్రత చూపలేకపోతున్నాను . ఋతుక్రమము సరిగాలేదు . ఇది మెనోపాజ్ ముందు దశ అనుకోవాలా? లేక ఎటెన్సన్ డెఫిసిట్ డిజార్డర్ (ఎడిడి ) అనుకోవాలా?
జ : ఇది ఎటెన్సన్ డిజార్డర్ కాదు . . మీ ఆహారము , నిద్ర , బహుళ పనుల వల్ల లేదా మూడ్ వల్ల కలిగే అలసట వంటి కారణాలున్నాయేమో అన్వేధించండి. గైనకాలజిస్టును సంప్రదిస్తే హార్మొనుల పరీక్షలు , ఓవరీలు , యుటెరస్ సైజును పరిశీలించేందుకు ఆల్ట్రాసౌండ్ చేస్తారు. డయాబెటీస్ , హైపర్టెన్సన్ , థైరాయిడ్ వంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయేమో తెలుసుకునేందుకు పూర్తి బాడీ చెక్ -అప్ అవసరము . వీటిలో ఏదైనా కారణము కావచ్చును. మంచి ఆహారమూ , సరిపడినంత నిద్ర తీసుకోవాలి . అవసరమైతే సైకియాట్రిస్ట్ ను సంప్రదిస్తే తగిన చికిత్స చేస్తారు.
- ===========================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.