Q : నా వయసు 50 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలు. ఈ మధ్య థైరాయిడ్ పరీక్ష చేయించుకున్నాను. థైరాయిడ్ ఉందని నిర్ధారణ అయ్యింది. అంతేకాక రక్తంలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉందని చెప్పారు. నాకు గర్భసంచి ఆపరేషన్ అయ్యి ఐదేళ్లు అయ్యింది. థైరాయిడ్‌కు కొలెస్ట్రాల్‌కు సంబంధం ఏమిటి? నా సమస్యకు పరిష్కారం తెలపగలరు.
A : మహిళల్లో థైరాయిడ్ సమస్యలు అధికం. థైరాయిడ్ తక్కువగా (హైపోథైరాయిడిజం) ఉన్నవారిలో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశముంది. అందువల్ల వెంటనే 'థైరాక్సిన్' బిళ్లలను డాక్టర్ సలహా మేరకు తక్కువ మోతాదులో మొదలుపెట్టండి. కొలెస్ట్రాల్ తగ్గించడానికి స్టాటిన్స్ మందులు వాడాల్సి ఉంటుంది. మీరు మెనోపాజల్ వయసులో ఉన్నారు కాబట్టి డాక్టర్ సలహా మేరకు మందులు వాడటం, బరువు తగ్గించుకోవటం చాలా ముఖ్యం.
- ===========================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.