ప్ర : పిల్లలకు తగినంత సూర్యకాంతి శరీరానికి తగలడము అవసరమా?.
జ : చాలా అవసరము . బిడ్డ పుట్టినప్పటి నుండి వారి శరీరానికి తిగిన సూర్యరశ్మి సోకుతుండాలి. కొందరు పిల్లలకు పుట్టుకతోనే " ఫిజియొలాజికల్ జాండిస్ " ఉంటుంది . అటువంటి పిల్లల శరీరము పై దుస్తులు లేకుండా ఉదయము , సాయంత్రము కొద్దిసేపు ఉంచితే మంచిది . ఇప్పుడు పరిశోధకులు మరో సరికొత్త విషయాన్ని గుర్తించారు . అలెర్జీలకు గురికాబడే పిల్లలకు సూర్యరశ్మి బాగామేలు చేసుందని ... వాతావరణ , మానవ ఆరోగ్య యూరోపియన్ కేంద్రము జరిపిన పరిశోధనలలోగుర్తించారు.
పిల్లలలో ఆహార సంబంధిత ఎలర్జీలు , ఎక్జిమా తగ్గడానికి ఎండ సహకరిస్తుంది . అంతగా సూర్యకాంతి సోకని ప్రదేశాల్లో నివసించే పిల్లలు , బాగా సూర్యకిరణాలు సోకే ప్రదేశాలలో ఉండేవారికంటే ఆహార ఎలర్జీలకు , ఎక్జిమా లకు ఎక్కువగా గురి అవుతారు . చర్మములో " విటమిన్ - డి " ఏర్పడడానికి శరీరానికి సూర్యకాంతి ముఖ్యము . కాబట్టి ఉదయము , సాయంత్రము వేళల్లో సూర్యరశ్మి సోకే విధము గా పిల్లల్ని ఆడుకోవడానికి ప్రోత్సహించాలి .
- =============================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.