- ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
Q : నాకు నలభై అయిదేళ్లు. ఇద్దరు పిల్లలు. పెళ్లయిన ఐదేళ్ల వరకు లైంగికచర్య అంటే పెద్దగా ఆసక్తి లేదు. దాంతో నా భర్తకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించేదాన్ని. ఆయనే చొరవ చూపి ఒత్తిడి చేస్తే, అయిష్టంగానే శారీరకంగా కలిసేవాళ్లం. మాకు ఇద్దరు పిల్లలు కలిగారు. పెద్ద వాళ్లయ్యారు. ఇప్పుడు నా పరిస్థితిలో మార్పు. ఆయన ఉద్యోగ విధులతో అలసిపోయి ఇంటికి చాలా ఆలస్యంగా వస్తున్నారు. నేను మాత్రం ఆయన నాతో సమయం కేటాయించాలని కోరుకుంటున్నాను. నాలో లైంగిక కోరికలు పెరిగాయి. మెనోపాజ్ దశలో ఉన్న నాలో ఈ తీరు చూసి మా వారు ఆశ్చర్యపోతున్నారు. ఆయన మాటలతో ఏదో తప్పు చేసిన దానిలా బిడియపడుతున్నా. ఈ మార్పు సహజమేనా?
A : మెనోపాజ్ వయసు వస్తే చాలు.. లైంగికాసక్తులు తగ్గుతాయనుకుంటారు చాలామంది. కానీ అది కేవలం అపోహ మాత్రమే. మీ వయసులో ఉండే చాలామంది మహిళలకు ఈ సమయంలో లైంగిక కోరికలు కొన్నిసార్లు తగ్గితే, మరికొన్ని సార్లు పెరగవచ్చు. ఇది సహజ సిద్ధంగా చోటుచేసుకునే మార్పు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. వాస్తవానికి మెనోపాజ్ దశ వచ్చాక, చాలామంది తామేదో నిస్సహాయులమని భావిస్తారు. ఆ లోపాన్ని కప్పి పుచ్చుకునేందుకు చిన్న వారిలా అలంకరణ చేసుకుంటారు. వయసుతో నిమిత్తం లేకుండా అందరితో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటారు. మీలోనూ అలాంటి మార్పే మొదలయ్యింది. పెళ్లయిన అయిదేళ్ల దాకా మీరు భర్తకు దూరంగా ఉండటానికి ప్రయత్నించారు. ఎలాంటి లైంగికాసక్తీ చూపలేదు. ఇప్పుడు మీలో ఒక్కసారిగా మార్పు కనిపించేసరికి మీ వారు ఆశ్చర్యపోతున్నారు. అంతమాత్రాన ఆయన మాటలతో బిడియ పడాల్సిన అవసరం లేదు. మీ భావాలను ఆయనకు వెల్లడించండి. కోరికలను వెల్లడించడానికి కూడా సంకోచించాల్సిన పని లేదు.
- ==============================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.