ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
Q : పురుషుల వీర్యములోని శుక్రకణాలు ఎక్కడ నుండి జనిస్తాయి? వాటిని స్ఖలించడము వలన శక్తి తగ్గుతుందా?.
A : శుక్రకణాలు వృషణాలలోని ముష్కము (cortex of testicle) లో ఉత్పత్తి అవుతాయి. ఒక శుక్రకణము కంటికి కనిపంచనంత సూక్ష్మమైనది. పురుషుడి లో శుక్రకణాలు నిరంతరం ఏర్పడుతుంటాయి. శుక్రనాళికల్లో ఒక శుక్రకణము ఏర్పడడానికి 74 రోజులు వరకూ పడుతుంది.
ప్రతి నిముషము 20 వేల శుక్రకణాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఒక శుక్రకణము 25 -40 రోజులు జీవిస్తుంది. పురుషులలో 12-14 ఏళ్ళ మధ్యలో శుక్రకణ ఉత్పత్తి మొదలై దాదాపు 70 ఏళ్ళ వరకూ ... ఆ పైనకూడా జరుగుతుంటుంది . వీర్యము అనేది మూడు గ్రంధుల ఉత్పత్తి మిశ్రమము .
- శుక్రనాళాలు ఉత్పత్తి చేసే రసాలు ,
- ప్రోస్ట్రేట్ గ్రంధి ఉత్పత్తి చేసే రసాలు ,
- వృషణాలు ఉత్పత్తి చేసే శుక్రకణాలు , కలిసి వీర్యము అవుతుంది .
- ====================================
visit my website - > Dr.Seshagirirao-MBBS
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.