ఫ్ర : మా అబ్బాయికి హెపటైటిస్ -బి . సోకింది . డాక్టర్ల దగ్గర సుమారు 6 నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నాము . చికిత్స అవసరం లేదంటే మానివేసాము . రక్తపరీక్ష చేయిస్తే పొజిటివ్ వచ్చింది . ఈ జబ్బు తగ్గదా?
జ : తగ్గుతుంది . హెపటైటిస్ (Hepatitis) అనగా కాలేయానికి చెందిన వ్యాధి. ఇవి వైరస్, బాక్టీరియా, ప్రోటోజోవా, కొన్ని మందులు మొదలైన వివిధ కారణాల వలన కలుగుతుంది. వీనిలో వైరస్ వలక కలిగే హెపటైటిస్ ను వైరల్ హెపటైటిస్ (Viral Hepatitis) అంటారు. వైరస్ అనగా జీవజాలంపై దాడి చేసే అతి సూక్ష్మమైన కణాలని అర్థం.
హెపటైటిస్ వైరస్లు (Hepatitis virus) ఒక వ్యాధికారక వైరస్ ల సమూహం. ఇవి అన్నీ వైరల్ హెపటైటిస్ (Viral Hepatitis) వ్యాధిని కలుగజేస్తాయి. ఈకాలేయ సంబంధితవ్యాధికి చెందిన వైరస్ ఎ,బి,సి,డి, ఇ,ఎఫ్ ఇలా ఆరురకాలుగా విభజించారు. వీటిలో హెపటైటిస్-ఏ, హెపటైటిస్-బి, హెపటైటిస్-సిలు మానవ శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపడమే కాకుండా ప్రాణాంతకాలుగా పరిణమిస్తాయి.
చికిత్స తరువాత ఈ వైరస్ శరీరములో లేకపోయినా సంబంధిత యాంటీబాడీస్ కొ్న్నాళ్ళు పాటు రక్తములో ఉంటూనే ఉంటాయి. ఆ కారణముగా ఎలీసా పరీక్ష పొజిటివ్ గా మనకు రి్పోర్టు వస్తుంది . దీనిని దృష్టిలో పెట్టుకొని మనకి ఆ వ్యాది వైరస్ ఇంకా ఉందనే అనుకుంటాము . భయపడవలసిన పనిలేదు.
మంచి డాక్టర్ ని సంప్రదించి తగిన సలహా పొందండి .
ట్రీట్మెంట్ :
- 1.pegylated interferon ఈ ఇంజక్షన్లు సుమారు ఒక సంవత్సరకాలము వాడాలి .
- 2.Nucleoside / nucleotide analogues.. ఉదా: Lamivudine
- 3.tab Livfit/Live-52ఈ మాత్రలు / సిరఫ్ సుమారు 4-6 మాసాలు వాడితే ఈ వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది.
- 4. బి.కాంప్లెక్ష్ మాత్రలు
- 5.vaccination : ఒక కోర్సు చికిత్స ఇచ్చిన తరువాత హెపటైటిస్ వ్యాధిగ్రస్తులకు టీకాలను నెలకి ఒకటి చొప్పున్న వరుసగా 3 డోసులు తీసుకోవాలి.
- ========================================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.