Q : నా వయస్సు 45 సంవత్సరాలు. గృహిణిగా వున్నాను. నా భర్త మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. నెలలో 20 రోజులు బయట తిరుగుతుంటారు. మా బాబు బిటెక్, పాప ఇంటర్ చదువుతున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి నన్ను మతిమరుపు బాధిస్తోంది. చిన్న చిన్న విషయాలు కూడా మరచిపోతున్నాను. స్టౌ మీద పెట్టిన పాలు మరిగి పొంగేవరకు గుర్తుకురాదు. వస్తువులు ఎక్కడో పెట్టి మరచిపోతుంటాను. ఒక్కోసారి బోరు మోటారు ఆపడం మరచి మార్కెట్‌కు వెళ్తుంటాను. పనిమనిషికి ఇవ్వాలనుకున్న జీతం లెక్కపెట్టి ఎక్కడో పెట్టి మరిచిపోతుంటాను. ఇలా ప్రతి విషయం మరచిపోవడంవల్ల ఒక్కోసారి సమస్యలు ఎదురవుతుంటాయి. మనసును గతి తప్పించే ఈ మతిమరుపును తగ్గించుకునే మందులేమైనా ఉన్నాయా?
A : మీ సమస్యకు మందులేవీ లేవు, అవసరం కూడా లేదు. మీ వయసులో వచ్చే మతిమరుపు జబ్బు కాదు. అలాగే మెదడులో లోపం వుండదు. మానసిక ఒత్తిడి, భయం, ఆందోళన, నిద్రలేమి, టెన్షన్‌లాంటి సమస్యలు తాత్కాలిక మతిమరుపునకు కారణమవుతుంటాయి. మీరు బాగా ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారని నా భావన. భర్త ఎక్కువ రోజులు బయట వుండటం, పిల్లలు రోజంతా కాలేజీలో గడపడంవల్ల మీలో ఒంటరితనం చోటుచేసుకుని వుంటుంది. అలాగే బయట తిరిగే భర్తపట్ల అనుమానం, భయం చోటుచేసుకునే అవకాశాలున్నాయి. భర్త సాన్నిహిత్యం కొరతవల్ల అసహనం, కోపం, చిరాకు పెరగవచ్చు. పిల్లల చదువు, ఇతర విషయాల పట్ల టెన్షన్ తలెత్తే అవకాశాలుంటాయి. అలాగే హార్మోన్ల సమస్య వుండవచ్చు. ఇవన్నీ కలిసి మీలో తీవ్రమైన వత్తిడి కలిగిస్తు వుండవచ్చు. కాబట్టి మీరు ఒత్తిళ్ళనుంచి బయటపడేందుకు ప్రయత్నించండి. మీ మనసుపై ఒత్తిడి కలిగించే అంశాలను గుర్తించి ప్రత్యామ్నాయాలు ఆలోచించండి. మంచి అభిరుచులు, శారీరక వ్యాయామం, స్నేహ సంబంధాలు, యోగ, ధ్యానమార్గాల ద్వారా స్వస్తత పొందేందుకు ప్రయత్నించండి.
- ========================
visit my website - > Dr.Seshagirirao-MBBS
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.