ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
ప్ర : నేను సన్నము గా పొడవుగా ఉంటాను.నార్మల్ గా లావెక్కేందుకు ఉపాయము చెప్పంది -- స్వాతి (లావేరు-శ్రీకాకుళం జిల్లా).
జ : లావెక్కాలంటే సన్నబడటమంత కష్టం కొందరికి. దానికోసం వారు విశ్వ ప్రయత్నాలు చేస్తారు, అయినా లావెక్కరు. అలాంటప్పుడు ఈ జాగ్రత్తలు పాటిస్తే కొంత ఫలితం
ఉంటుంది.
* మెటబాలిజం, జీన్స్ వంటివి ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటాయి. దాన్ని బట్టే వారి శరీర తత్వం ఆధారపడి ఉంటుంది. సన్నగా ఉన్నామనే ఆత్మన్యూనతతో కొందరు
అదేపనిగా తినడానికి ప్రాధాన్యమిస్తారు. అయితే ప్రతి ఒక్కరూ బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) ప్రకారమే పోషకాహారాన్ని తీసుకోవాలి. అతిగా తినడం వల్ల లావు అవడం
మాటేమో కానీ ఇతరత్రా అనారోగ్యాలు చుట్టుముట్టే ప్రమాదముంది.
* 'అసలే సన్నగా ఉన్నావ్, నీకు వ్యాయామం ఏంటి?' అంటుంటారు కొందరు. కానీ అది నిజం కాదు. రోజూ వ్యాయామం చేయడం వల్ల శరీరం చక్కటి ఆకృతిని
పొందుతుంది. లావెక్కడం అంటే బరువు పెరగడం కాదు, దృఢత్వాన్ని పొందడమని మరిచిపోకూడదు.
* ఒకేసారి ఎక్కువగా తినడం కంటే విరామమిస్తూ కొద్దికొద్దిగా ఐదారు సార్లు తినడం మంచిది. వీటిల్లో తాజా పండ్ల ముక్కలూ చేర్చుకోవాలి. కాలక్షేపంగా తినడానికి గుప్పెడు
జీడిపప్పు, బాదం చేతిలో ఉంచుకొని అప్పుడప్పుడు తింటే సహజంగా బరువు పెరగడానికి ఉపయోగపడతాయి. రోజూ రాత్రి పడుకునే ముందు నాలుగైదు బాదం గింజల్ని
ముక్కలుగా చేసుకుని, వేడి పాలల్లో వేసుకొని తాగినా ఫలితం ఉంటుంది.
* ఉదయాన్నే పెరుగు అన్నము తింటే లావెక్కేందుకు దోహదం చేస్తుంది.
* పగటి పూట నిద్రపోతే లావెక్కే వీలుంది. కనుక రాత్రి మాత్రమే నిద్రపోయే అలవాటు కాకుండా పగలు కొంతసేపు నిద్రపోయే అలవాటు చేసుకోవాలి.
*తినే ఆహారంలో ఎర్రని మాంసాహారం , గుజ్జు కలిగిన పండ్లు, నూనెలో వేపినకూరల తినడానికి ప్రయత్నించాలి ...
* ఆకలిని చంపేయగల శక్తి నీటికి ఉంది. నీరు బాగా తాగితే భోజనం తక్కువగా తింటారు. ఫలితంగా లావెక్కే అవకాశం తగ్గుతుంది. అవసరమున్నప్పుడే నీరు తాగాలి . భోజనము ముందు నీరు తాగడము చేయకూడదు .
- ===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.