Q : స్విమ్మింగ్ ఫూల్ లో కెమికల్స్ ఆరోగ్యానికి హానికరమా?
A ; స్విమ్మింగ్ ఫూల్ లో డిసిన్‌ఫెక్టెంట్ లు ఎక్కువగా వాడుతుంటారు. ఎక్కువగా వాడేది క్లోరీన్ . ఇది నీటిలో బ్యాక్టీరియాను నశింపచేయగలదు . ఫూల్స్ లో క్లొరీన్ కాన్‌సెంట్రేషన్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది . పొటెన్‌షియల్ హానిక బై-ప్రొడక్ట్ " హా" (హలోసెటిక్ యాసిడ్) ఉంటుంది . స్విమ్మింగ్ ఫూల్ ను క్రమము తప్పకుండా క్లీన్ చేస్తూఉంటే ' హా ' కనీసమాత్రముగా ఉంటుంది . అయినా తగిన జాగ్రత్తలు అవసరము .
- నీరు ... ముక్కు , చెవులు ,నోటిలోకి వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- పిల్లకకు ఏదైనా ఇన్‌ఫెక్షన్ ఉంటే తగ్గే వరకూ స్విమ్మింగ్ కు పంపకూడదు ,
- స్విమ్ చేసిన తరువాత ఇంటికి రాగానే గోరువెచ్చని నీటితో తల స్నానము చేయించుకోవాలి .
- శిరోజాలకు .. క్లోరీన్ వలన నష్టము జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి,
- మంచి స్విమ్మింగ్ ఫూల్ ని ఎంచుకోవాలి,
- సమ్మర్ లో రష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ జాగ్రత్తలు పాటించాలి.
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.