ప్ర : నేను బహుళజాతి సంస్థలో ఉద్యోగిని.. రకరకాల పనివేళల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పని ఒత్తిడి కూడా ఎక్కువే. దాంతో టీ, కాఫీలు ఎక్కువగా తీసుకుంటా. గత కొన్నాళ్ల నుంచి కడుపులో మంట బాధిస్తోంది. అప్పటికప్పుడు ఏదైనా తింటే సమస్య అదుపులో ఉంటోంది. దాంతోపాటు చేదు, పులుపుతో కూడిన తేన్పులూ వస్తున్నాయి. తగిన పరిష్కారాలు చెప్పండి.
జ : పని ఒత్తిడి, మానసిక సమస్యలు, నెలసరి ముందు వచ్చే ఆందోళనలు... టీలు, కాఫీలు, ధూమపానం, పులుపు, ఉప్పు, కారం, మసాలాలు అధికంగా తీసుకోవడమే మీ సమస్యకు కారణం. తలనొప్పి, కీళ్ల నొప్పికి కొలెస్ట్రాల్‌కి అధికంగా మందులు వాడినప్పుడు కూడా ఆహార జాగ్రత్తలు తీసుకోవాలి. పొడిగా కారంగా ఉండే ఆహారం, నూనెల్లో వేయించిన పిండి వంటలు, వేపుళ్లు... కడుపులో ఆమ్లాలను పెంచి మంట పుట్టిస్తాయి. కొన్నిసార్లు వయసుతోపాటు ఎంజైములు తగ్గి ఆమ్లాలు పెరిగి కడుపులో మంట తప్పదు. దీన్ని సక్రమంగా చెయ్యకపోయినా కడుపులో బొబ్బలు ఏర్పడి మరింత ఇబ్బందిని కలిగిస్తాయి.
చప్పని పదార్థాలకు ప్రాధాన్యమివ్వాలి. పాలు, పెరుగు, మజ్జిగ భోజనానికి రెండు గంటల ముందు తీసుకొంటే మంచిది. టీ, కాఫీలను సాధ్యమైనంత దూరంగా పెట్టాలి. ఆయుర్వేదంలో పదమూడు రకాల అగ్నుల గురించి చెబుతారు. వీటిలో 'జఠరాగ్ని' అంటే కడుపులో ఉండే ఆమ్లాలు. ఆ పొరల్లో ఉండే కణ జాలం నుంచి విడుదలయ్యే రసాలు ఎంతో ఉపయోగపడతాయి. కడుపులో మంటకు ముందు ఆహారం అరగకపోవడం, మలబద్ధకం. చేదు, పులుపుతో కూడిన తేన్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాలేయం, మూత్రపిండాల సమస్యలు, గాల్‌బ్లాడర్ సమస్య ఉన్నవారికి పైత్యంతో కూడిన కడుపు మంట బాధించే ఆస్కారం ఉంటుంది. అలాంటప్పుడు గోరువెచ్చటి నీళ్లు మాత్రమే తాగాలి. పప్పు దినుసులు మితంగా తీసుకోవాలి. బాగా ఉడికిన కూరలను తీసుకోవాలి. ఆహారం కొంచెం కొంచెంగా తినాలి. పుల్లటి పళ్లు, పులుసులను తీసుకోకూడదు. మజ్జిగలో గోరువెచ్చటి నీళ్లు కలిపి తీసుకుంటే మంటను తగ్గిస్తుంది.
* విటమిన్ 'సి' అధికంగా ఉండే ఉసిరిక పొడిని పాలల్లో కలిపి తీసుకోవచ్చు. క్యారెట్, బీట్‌రూట్ రసాలు కడుపులో ఆమ్లాలను తగ్గిస్తాయి. అతి మధురం చిటికెడు, కరక్కాయ పొడి రెండు చిటికెలు తీసుకుని వీటికి సమానంగా పంచదార, చిటికెడు నెయ్యి వేసి భోజనానికి ముందు కానీ తరవాత కానీ పుచ్చుకోవచ్చు. కరక్కాయ, అతిమధురం, నేల ఉసిరి, చిటికెడు చొప్పున పాలలో లేదా తేనెతోపాటు కలిపి స్వీకరిస్తే ఉపశమనం లభిస్తుంది.
* పచ్చి అరటిని ఎండబెట్టి చేసిన పొడిని అరచెంచా, పంచదార, చిటికెడు వాముపొడి కలిపి తినాలి. సోంపు అరచెంచా, ఉసిరిక పొడి, చిటికెడు పటిక బెల్లం తగినంత కలిపి భోజనం తరవాత తిన్నా ఫలితం ఉంటుంది. చిటికెడు చొప్పున లోహభస్మం, ఉసిరిక పొడి పాలలో కానీ తేనెలో కానీ కలిపి పుచ్చుకోవచ్చు. అరచెంచా పిల్లి పీసర, ఉసిరిక పొడి పావుచెంచా, తగినంత తేనె కలిపి కప్పుడు పాలతో తీసుకోవాలి. నేలవేము చూర్ణం, జాజికాయ చూర్ణం చిటికెడు చొప్పున తేనెలో కలిపి స్వీకరించినా మార్పు కనిపిస్తుంది. కాబట్టి ఆయుర్వేద నిపుణులను మరోసారి సంప్రదించి.. ఆ తరవాత చికిత్సను ప్రారంభించండి.
అల్లోపతి :
Tab. Omeprazole 20 mg daily one Early morning .. or
Tab. Rabeprazole 20 mg daily one Early morning .. or
Tab. Pantaprazole 40 mg daily one Early morning ..
Tab. Gelusil MPS daily 3-4 chew on feeling buring stomach... తీసుకుంటే కడుపులో మంట తగ్గిపోతుంది.
- =====================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.