ప్ర : నేనొక ప్రముఖ సంస్థలో పని చేస్తున్నాను. స్నేహితులు, సహోద్యోగుల్లో ఎవరో ఒకరు తరచూ పార్టీలకు ఆహ్వానిస్తూనే ఉంటారు. కాదనలేక మొహమాటంగానే హాజరవుతున్నా. అయితే బయట రెస్టారంట్లలో మసాలా పదార్థాలు తీసుకుంటే ఇబ్బందిగా ఉంటోంది. కడుపులో ఉబ్బరం, తిప్పడం. ఒక్కోసారి విరేచనాలు అవుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం చెప్పండి.
జ : బయటి తినుబండారాలు రుచిగా అనిపిస్తాయి. కానీ వాటిల్లో నూనెలు అధికం. తయారీలో శుభ్రమైన నీరు వాడాలి. నిల్వ ఉన్న పదార్థాలయితే ఆహారం కలుషితం అవుతుంది. దాన్ని తిన్నప్పుడు రకరకాల వ్యాధులు రావచ్చు. ఆహారం వండేటప్పుడు గిన్నెలు, చేతులను, కూరగాయలను శుభ్రంగా కడగాలి. లేదంటే ఆరోగ్య సమస్యలు రావచ్చు. కొంతమందికిది తక్షణం జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు వాంతులు, విరేచనాలు, అజీర్ణం లాంటి సమస్యలు బాధించవచ్చు. మాంసాహారం, కోడిగుడ్లు, వండిన కూరలు ఎప్పటికప్పుడు తినడం మేలనే విషయాన్ని మరిచిపోకూడదు. ఇక, మీరేం చేయాలంటే.. కాచి చల్లార్చిన నీళ్లు తాగడం మేలు. పెసరకట్టు, కందికట్టు లేదా బియ్యంగంజిలో చిటికెడు కరక్కాయ పొడి వేసి పుచ్చుకుంటే అజీర్ణం తగ్గుతుంది. ఉల్లిపాయ రసంలో నిమ్మరసం, వాము చిటికెడు ఉప్పు, బియ్యంగంజిలో కలిపి తీసుకోవాలి. మితాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. దానిమ్మ రసం 30ఎమ్‌ఎల్ చొప్పున తీసుకోవచ్చు. అల్లంరసం, తేనె కలిపి తీసుకున్నా ఫలితం ఉంటుంది. అజీర్ణంతో బాధపడేవారు భోజనానికి ముందు అల్లంరసం, సైంధవ లవణం చిటికెడు కలిపి తీసుకుంటే సత్వర ఉపశమనం దొరుకుతుంది. జీలకర్ర, పంచదార, మిరియాలపొడి చిటికెడు చొప్పున, తగినంత తేనె కలిపి తీసుకుంటే వాంతులు తగ్గుతాయి. రేగుపళ్లగుజ్జు, చెంచా యాలకులపొడి, లవంగాలు, పిప్పళ్లు చిటికెడు చొప్పున తీసుకుని పంచదార కలిపి తిన్నా మార్పు కనిపిస్తుంది.
Tab. Omeprazole 20 mg daily one Early morning .. or
Tab. Rabeprazole 20 mg daily one Early morning .. or
Tab. Pantaprazole 40 mg daily one Early morning .. తీసుకుంటే కడుపుబ్బరం తగ్గిపోతుంది.
- =====================================
visit my website - > Dr.Seshagirirao-MBBS
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.