- ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము
ప్ర : ఒక రోజు మా ఇరుగుపొరుగు స్నేహితురాళ్లందరం కలిసి రెస్టరంట్‌కు వెళదామనుకున్నాం. తీరా నేను బయల్దేరాక 'మన కార్యక్రమం రద్దయింది' అని ఓ స్నేహితురాలు నేను ఫోన్ చేస్తే చెప్పింది. మరో ఆవిడకి చేసినా అదే జవాబు. నేను కాల్ చేసే వరకు ఎవరూ చెప్పనందుకు పట్టలేని కోపమొచ్చింది. కానీ కొద్దిసేపయ్యాక 'ఎవరో ఒకరు తనకు చెబుతారులే' అని అందరూ అనుకోవడం వల్ల ఆ సమాచారం రాలేదని గ్రహించాను. ఎందుకిలా జరుగుతుంది ?
జ : మన చుట్టుపక్కల వాళ్లతో స్నేహంగా మెలగడం ఎంత ముఖ్యమో.. వారితో అతి చనువు లేకుండా ఉండటం కూడా అంతే అవసరం. ఎందుకంటే అనుబంధాలు దూరం కావడానికి గొడవలే పడనక్కర్లేదు... వారిని నొప్పించినా చాలు అగాధాలు పెరిగిపోతాయి. సంబంధాలు బెడిసికొడతాయి. పొరుగు వారు తరచూ ఇంటికి రావడం, వ్యక్తిగత విషయాల్లో చొరవ చూపడం, గంటల కొద్దీ కబుర్లు చెప్పడం వంటివి కొందరికి నచ్చకపోవచ్చు. అలాగనీ వాళ్లతో అంటీ ముట్టనట్టు కాకుండా పరిమితులకు లోబడి మెలగాలి. సందర్భాన్ని బట్టి మాట కలపడం.. అవసరాన్ని బట్టి వాళ్లింటికి వెళ్లడం చేయాలి. అయితే ముఖ్యమైన విందులు, వేడుకల వంటి వాటికి వెళ్లకుండా ఉండటం కూడా సరికాదు. అత్యవసర పరిస్థితుల్లో మానేస్తే.. వీలు చూసుకొని పొరుగింటికి వెళ్లిరావడం మంచిది. అలానే పండగలు, ప్రత్యేక సందర్భాలకు ఆహ్వానించడం.. చేసిన పిండివంటల్ని ఇతరులతో పంచుకోవడం.. వల్ల వారితో అనుబంధాలు దృఢమవుతాయి. కుదిరితే.. ఇరుగుపొరుగు వారంతా కలిసి ఓ రోజైనా విహారయాత్రకు వెళ్లివచ్చేలా ప్రణాళిక వేసుకోవచ్చు.
మాట పట్టింపు లేకుండా..కలుపుగోలుగా ఇరుగుపొరుగుతో కలిసిపోయినప్పుడే సత్సంబంధాలు మెరుగవుతాయి. అప్పుడే ప్రతి అవసరానికీ ఆదుకొనే ఆప్తులున్నారన్న భద్రత ఉంటుంది. లేదంటే తరచూ గొడవలు పడుతూ.. చీటికీ మాటికీ ఎదుటివారిపై రుసరుసలాడుతుంటే మిగిలేది మానసిక ఒత్తిడే .
- .======================================
visit my website - > Dr.Seshagirirao-MBBS
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.