ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
ప్ర : స్విమ్మింగ్ చేసిన తరువాత నేనెప్పుడూ అతిగా తింటుంటాను. ఈ అలవాటు మానుకునేదెలా?
జ : శారీరక తెంపరేచర్ వల్ల ఇలా తినాలనిపిస్తుంటుందని పరిశోధకులు చెప్తున్నారు. చల్లని నీటిలో వ్యాయామాలు చేసేవారు , కొంచెం వెచ్చగా ఉన్న నీటిలో చేసేవారికంటే 44% ఎక్కువ ఆకలితో ఉంటారని వారు గుర్తించారు. శరీరాన్ని వెచ్చబరుచుకునే క్రమం లో అదనపు శక్తి కోసము ఆహారము తినాలనిపిస్తుంది . స్విమ్మింగ్ తరువాత 15 నిముషాలు వాకింగ్ చేయడము వల్ల శారీరక ఉష్ణోగ్రత పెరిగి ఏదో ఒకటి తినాలన్న కోరిక తగ్గుతుంది.
- ===========================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.