ప్ర : ఎప్పుడు లాంగ్ డ్రైవ్ చేసినా వెన్నునొప్పి వస్తుంది . ఏం చేఅయాలి ?
జ : రోడ్ పై మలుపు తిప్పాల్సినప్పు్డల్లా వెన్నెముక కర్వ్ పై దృష్టి నిలపండి . నిలబడినపుడు లోయర్ బ్యాక్ సహజమైన ఒంపు కలిగిఉంటుంది . కూర్చున్నపుడు దాన్ని మెయిన్‌టెయిన్ చేయాల్సిఉంటుంది . సమస్యల్లా చాలాభాగం ఆటోమొబైల్స్ సీట్లు స్వల్పకాలిక సౌకర్యం తో అమర్చుతారే తప్ప దీర్ఘకాలిక సపోర్ట్ ను దృష్టిలో ఉంచుకోరు. ప్లష్ సీట్ వెన్నెముక స్లంప్ కు కారణమై , అది డిస్కులపై ఒత్తిడి పెడుతుంది . సీటు సరిగా ఎడ్జెస్ట్ చేసుకోండి .
ఇడియల్ పొజిషన్ అనేది అందరికీ ఒకే మాదిరి ఉండదు . వ్యక్తికీ వ్యక్తికీ మారుతుంది . యాంగిల్ సరిగా కుదుర్చుకొని రిలాక్సింగ్ గా కూర్చోండి . మధ్య మధ్యలో ఆగి స్ట్రెచ్ చేస్తుండండి . రెండు చేతులూ పైకెత్తి సుదీర్ఘంగా గాలిపీల్చి వదులుతుండాలి . ప్రతి బ్రేక్ లో ఇలా మూడు నుంచి ఐదు సార్లు చేయండి . సీట్ కు బిల్ట్-ఇన్ లుంబార్(Lumbar) ఎడ్జెస్ట్ మెంట్ ఉంటే అనువుగా సెట్ చేసుకోండి .
- ===========================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.