- image : courtesy with Eenadu news paper (vasundara )
Q : నా విధుల్లో భాగంగా ప్రతిరోజూ మేకప్ తప్పనిసరి. కానీ దానికోసం అరగంట నుంచి ముప్పావు గంటదాకా సమయం కేటాయించాల్సి వస్తోంది. ఆ సమయాన్ని తగ్గించి.. సులువైన అలంకరణ చేసుకోవడం సాధ్యమవుతుందా. మేకప్ వేసుకునేముందు ఈ కాలంలో జాగ్రత్తలేమైనా తీసుకోవాల్సి ఉంటుందా?
A : ఏ కాలమైనా సరే.. చిన్నచిన్న అంశాలపై దృష్టిసారిస్తే.. సులువుగా మేకప్ చేసుకోవచ్చు. శీతాకాలంలో.. మేకప్ వేసుకునే ముందు మాయిశ్చరైజర్ తప్పనిసరిగా రాసుకోవాలి. దానికి బదులుగా మేకప్ సీరమ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. నాలుగైదు చుక్కలు రాసుకుంటే.. ఎక్కువ సమయం తాజాగా కనిపించవచ్చు. ఇది శీతాకాలం కాబట్టి లిక్విడ్ ఫౌండేషన్‌ను ఎంచుకోవాలి. చలికాలంలో పాన్ కేక్ మేకప్‌నకు దూరంగా ఉండాలి. చాలా తక్కువగా పౌడర్‌ను అద్దుకోవాలి. చలికాలమంటే.. కళ్లు కూడా పొడిబారి ఉంటాయి కాబట్టి ఐలైనర్ లేదా కాటుకను కొద్దిగా రాసుకోవాలి. పెదవులకు విటమిన్ ఇ సుగుణాలున్న లిప్‌స్టిక్‌లు ఎంచుకొంటే మృదువుగా, అందంగా కనిపిస్తాయి. బ్లషర్ అవసరం లేదు. పగటివేళకు నప్పే ఈ అలంకరణ చేసుకోవడానికి కేవలం పదిహేను నిమిషాల సమయం మాత్రమే పడుతుంది.
- =================================
visit my website - > Dr.Seshagirirao-MBBS
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.