జ : సహజ చర్మతత్వం ఉన్నవాళ్లు ఎట్టి పరిస్థితుల్లో మరీ మందంగా మేకప్ వేసుకోకూడదు. ముఖ్యంగా ఫౌండేషన్. దీన్ని ఎక్కువగా వేయడం వల్ల ముడతలు ఇంకా స్పష్టంగా కనిపిస్తాయి. క్రీం ఆధారిత ఫౌండేషన్‌ను చాలా తక్కువగా రాసుకోవాలి. మెరిసే పౌడర్ కాకుండా కాంపాక్ట్ లేదా లూస్‌పౌడర్‌ను రాయండి. అలాగే బ్రౌను రంగు లిప్‌స్టిక్‌కు ప్రాధాన్యం ఇవ్వండి. మెటాలిక్, పెర్ల్ లిప్‌స్టిక్‌లు ఎంచుకోకపోవడమే మంచిది. చాలా తక్కువగా నలుపు లేదా బ్రౌను రంగు ఐలైనర్, మస్కారా వేసుకోండి. అంతేకానీ ఫ్యాన్సీ కలర్ల జోలికి వెళ్లకూడదు. పొద్దుటిపూట ఐషాడో వాడకపోవడమే మేలు. సాయంత్రాలు తప్పనిసరనుకుంటే.. బ్రౌన్, బూడిదరంగులు ఎంచుకోవచ్చు. ముదురు రంగు లిప్‌స్టిక్, ఐషాడోలను రాసుకుంటే ఇంకా పెద్దగా కనిపిస్తారు. కాబట్టి ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మేకప్ సామగ్రిని ఎంచుకోవాలి.
==కె.లలిత--న్యూట్రిషనిస్ట్ అండ్ బ్యూటీకాస్మెటాలజిస్టు
- ===========================================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.