జ : కురులు అందంగా కనిపించాలని హెయిర్ స్త్టెలింగ్ జెల్స్ రాసుకోవడం వల్ల పెద్దగా నష్టం ఉండదు కానీ.. ప్రతిరోజు డ్రయర్‌మాత్రం వాడకూడదు. దీనివల్ల జుట్టు పొడిగా కనిపిస్తుంది. అలాగే కురులకు జెల్ రాసిన తరవాత ఎక్కువ సార్లు దువ్వితే.. జుట్టు పాడవుతుంది. తప్పనిసరనిపిస్తే.. వెడల్పాటి దంతాలున్న దువ్వెనను వాడాలి. మీ సమస్యను నివారించాలంటే.. వారానికి మూడుసార్లు కొబ్బరినూనె రాసి గంటాగి తలస్నానం చేయండి. కొబ్బరినూనెకు బదులుగా ఆముదం కూడా వారానికి రెండుసార్లు రాసుకోవచ్చు. అలాగే ఈ ప్యాక్ ప్రయత్నించండి. కప్పు అరటిపండు గుజ్జు, కలబంద గుజ్జు, మందారపువ్వుల గుజ్జు అరకప్పు చొప్పున తీసుకుని బాగా కలిపి తలకు పట్టించాలి. జుట్టు పట్టుకుచ్చులా మారుతుంది. ఈ పూతను వారానికి రెండుసార్లు వేసుకోవాలి.
- ===============================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.