ప్ర : నాకు ఋతుక్రమం లో ఒత్తికడుపులో విపరీతమైన నొప్పి ఉంటుంది . ఒక్కోసారి వారము రోజులు ఉంటుంది . నాలుగేళ్ళు గా ఇదే పరిస్థితి . ఏమి చేయాలి ? -- నరసమ్మ కొమ్మూరి ;;కోటపల్లి .
జ : దీనిని డిస్మెనోరియా అంటారు . ఇటువంటి నొప్పికి సాధారణంగా ఎండోమెట్రియోసిస్ కారణము కావచ్చును . గర్భసంచి వెలుపల యుటెరస్ లైనింగ్ డొపొజిషన్ వల్ల టిష్యూ ఇన్‌ఫెక్ట్ అయి , ఉదరము లోపల కొద్దిగా రక్తస్రావము కావచ్చు . దీనివల్ల విపరీతమైన నొప్పి వస్తుంది .
చికిత్స : ఉపశయనం కోసము పెయిన్ కిల్లర్స్ -- Tab. Dysmen రోజుకి 2 లేదా 3 మాత్రలు వాడవచ్చును. వాంతులు ఉంటే -- Tab Stemtil 1 tab 2time / day ... 1-2 days . దీర్ఘకాలిక నివారణకోసం ఎండోమెట్రియల్ డిపాజిట్స్ కాటరైజేషన్ అవసరము ఉంటుంది . గైనకాలజిస్ట్ ని సంప్రదించి ... స్కానింగ్ చేయించుకొని కారణం తెలుసుకొనే ప్రయత్నం చేయాలి. ఇటువంటి వారికి సంతానము కూడా కలుగడం ఆలస్యము అవుతుంది .
పూర్తి వివరాలకు : ఇక్కడ క్లిక్ చేయండి ->Dysmenorrhoea (in Telugu)
- ======================================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.