A : థైరాయిడ్ హార్మోన్ మన శరీరంలో చాలా భాగాల పెరుగుదలపై, వాటి పనితీరుపై ప్రభావాన్ని చూపుతుంది. వీటిలో ఫెర్టిలిటీ, రీ-ప్రొడక్షన్ ముఖ్యమైనవి. థైరాయిడ్ హార్మోన్ లెవల్స్ వయసును బట్టి, శారీరక స్థితిని బట్టి మారతాయి. టాబ్లెట్లు వాడుతున్నప్పుడు నెలసరి సరిగ్గా ఉందన్నారు కాబట్టి థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించండి. అది మామూలుగా ఉన్నట్లయితే పీరియడ్స్ నాలుగు నెలల పాటు రాకపోవడానికి ఇతర కారణాలు వెతకవలసి ఉంటుంది. ఒకవేళ థైరాయిడ్ హార్మోన్ లెవల్స్ మామూలుగా లేకపోతే, వాటి స్థాయులను బట్టి మందులు వాడాలి. దీంతో పీరియడ్స్ సక్రమంగా వచ్చేందుకు అవకాశం ఉంది. థైరాయిడ్ లెవల్ మామూలుగా ఉండి, పీరియడ్స్ సాధారణంగా ఉన్నట్లయితే పిల్లలు పుట్టడంలో ఎలాంటి ఆటంకాలు ఉండవు. కాని ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఈ హార్మోన్ టాబ్లెట్లు వాడాలి. తరచుగా థైరాయిడ్ లెవల్స్‌ని టెస్ట్ చేయించుకోవాలి. బిడ్డకి కూడా పుట్టిన కొద్ది రోజులకే థైరాయిడ్ టెస్ట్ చేయించాల్సి ఉంటుంది.
- =======================================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.