Saturday, November 23, 2013

Use of cell phone not good during pregnancy?,గర్భిణులు సెల్‌ మాట్లాడవచ్చా?

  •  
  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
ఫ్ర : గర్భిణులు సెల్‌ మాట్లాడవచ్చా?
జ : గర్భంతో భర్తకు దూరంగా ...పుట్టింట ఉండటం కాస్త కష్టమే. కానీ అంతా అయినవారు ఉన్నా మనసెరిగిన మారాజు చెంతనలేడన్న లోటు తీర్చుకునేందుకు పూర్వకాలంలో ఉత్తరాలు రాసుకుంటే ...ఇప్పుడు ఆ జంటల మధ్య దూరాన్ని తగ్గించే బాధ్యత సెల్‌ఫోన్లే తీసుకున్నాయని చెప్పాలి. దీంతో అదే పనిగా అవసరం ఉన్నా లేకున్నా సెల్‌ఫోన్లతో గర్భంతో ఉన్నవారు ఎక్కువగా తన భర్తతో మాట్లాడేస్తున్నారు.

గర్భంతో ఉండే మహిళలు సెల్‌ ఫోన్‌తో ఎక్కువగా మాట్లాడితే పుట్టబోయే బిడ్డకు ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పరిశో ధకులు. ఈ విషయమై కాలిఫోర్నియా, దక్షిణ కాలిఫోర్నియా లకు చెందిన శాస్త్రజ్ఞుల బృందం జరిపిన తాజా అధ్యయనంలో ఈ నిజం వెలుగు చూసినట్లు వెల్లడించారు. కాలిఫోర్నియాలో దాదాపు 30 వేల మంది చిన్నారులపై వివిధ రకాల పరీక్షలు జరిపి, శోధించగా వారిలో 50శాతం మందికి పైగా రేడియేషన్‌ ప్రభావానికి గురైనట్లు తేలిందని తేల్చి చెప్పారు.అందుకు కారణం ఆ బిడ్డల తల్లులు గర్భంతో ఉన్నప్పుడు ఎక్కువగా సెల్‌ఫోన్‌ వాడటమే ప్రధానంశంగా తేల్చి చెప్పారు. పుట్టగానే ఆ రేడియేషన్‌ ప్రభావం పైకి కనిపించదని, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించినా వయసు పెరుగుతున్న కొలది అవలక్షణాలు బైటకు వస్తున్నట్లు తాము గుర్తించినట్లు శాస్త్రవేత్తల బృందం స్పష్టం చేసింది.

తల్లి గర్భంతో ఉన్నప్పుడు రేడియేషన్‌ ప్రభావానికి గురయ్యే చిన్నారులు 30 శాతంగా నమోదు కాగా... చిన్నారుల ముద్దు మాటలకు ముచ్చటపడి సెల్‌ ఫోన్లలో మాట్లాడించడం వల్ల 20 శాతం మంది రేడియేషన్‌ ప్రభావానికి గురవుతున్నారని, దీని వల్ల ఈ చిన్నారు లు ఏడేళ్ల వయసుకు వచ్చేసరికి వారి ప్రవర్తనలో అసాధారణ మార్పులు కల్గడమే కాకుండా ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎదుర్కొంటున్నట్లు గమనించామని పరిశోధకులు చెబుతున్నారు.  గర్భిణులు నిరిష్టకాల పరిమితిలో అవసరానికి అనుగుణంగా మొబైల్‌ వినియోగిస్తే తప్పుకాదని, రోజులో కావా ల్సిన వారితో మూడు, నాలుగుసార్లు సంభాషించుకో వచ్చని... అయితే అది కూడా నాలుగు నిమిషాలకు మించకుండా ఉండాలని, అంతకన్నా ఎక్కువ సేపు మాట్లాడితే పుట్టే బిడ్డపై రేడియేషన్‌ ప్రభావం అధికంగా ఉండటం తధ్యమని హెచ్చరిస్తున్నారు. మరి పుట్టే పిల్లల భవిష్యత్‌ని తామే అంధ కారంగా మార్చకుండా...కొన్నాళైనా సెల్‌ ఫోన్లకి దూరంగా ఉంటే మంచిదేమో? మీ సమాచారం కన్నా మీ బిడ్డ క్షేమం కూడా ముఖ్యమే కదా.

  •  *===========================

Tuesday, November 19, 2013

is brown bread good for dhildren?,పిల్లలకు వైట్-బ్రెడ్ కంటే బ్రౌన్‌-బ్రెడ్ మంచిదా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : పిల్లలకు వైట్-బ్రెడ్ కంటే బ్రౌన్‌-బ్రెడ్  మంచిదా?.

జ : హోల్ వీట్ బ్రెడ్(బ్రౌన్‌-బ్రెడ్) ను పూర్తి స్థాయి గోధుమ పిండితో తయారుచేస్తారు.. .. కాబట్టి వీటిలో పీచు పదార్ధము , విటమిన్లు,ఖనిజలవణాలు   అధికముగా ఉంటాయి . వైట్-బ్రెడ్ ను రిఫైండ్ పిండితో తయారుచేస్తారు. వీటి పై లేయర్ లో పీచు కాని , విటమిన్లు కాని , ఖనిజలవణాలు ఉండవు . కావున పిల్లలకు హోల్ గ్రైన్‌(బ్రౌన్‌)బ్రెడ్ ఇవ్వడమే మంచిది. బ్రెడ్ పేకెట్ల పై గల తయారీపదార్ధాలు జాబితా చదివి ఎంచుకోవాలి. బ్రౌన్‌ గా కనిపించే బ్రెడ్ లన్ని హోల్-వీట్ కాకపోవచ్చు .

  • *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Causes for teeth gap in children,పిల్లలకు పళ్ళమధ్య ఎక్కువ గ్యాప్ ఉండడము దేనివల్ల?



  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : పిల్లలకు పళ్ళమధ్య ఎక్కువ గ్యాప్ ఉండడము క్యాల్సియం లోపము వల్ల వస్తుందా?.

జ : ఎంతమాతమూ కాదు . పళ్ళ మధ్య సందులనేవి కాల్సియం లోపము వలన వచ్చేవి కావు ... ఇతత కారణాలు ఎన్నో ఉంటాయి.ఈ కండిషన్‌ ని డైఆస్టిమాస్ (Diastemas)అంటారు.

  • వారసతము కావచ్చు ,
  • నోటి పరిశుభ్రత పాటించకపోవడము కావచ్చు ,
  • చిన్న పిల్లలలో దౌడ పెరగడము వలన ... పాలపళ్ళు సైజు అదేసైజు లో ఉండిపోవడము కావచ్చు .
  • కొన్ని రకాల గమ్‌ వ్యాధుల వలన కావచ్చు ,
  • అదేపనినా నాలుకతో పళ్ళను ముందుకు తోయడము ... ఒక మానసిన అలవాటు కావచ్చు,
  • కొన్ని దౌడ , గమ్‌ క్యాన్సర్ లు అరుదుగా కుడా గ్యాప్ కి కారణము కావచ్చు .

గాప్ ఉంటే దంత వైద్యుని సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలి . 7 ఏళ్ల లోపే చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. 


  • *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

What to do for skin tightening?,చర్మము బగుతుగా రావాలంటే ఏం చేయాలి ?




ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : నా వయసు 38 సం.లు .నాచర్మము అంతకుముందు మాదిరి బగుతుగా వుండదములేదు . తిరిగి పూర్వస్థితికి రావాలంటే ఏం చేయాలి ?

జ : వయసు పెరిగే కొద్దీ చర్మము లోని కొలాజెన్‌, ఎలాస్టిన్‌లు లూజ్ అయ్యి చర్మము సాగుతుంది . ఇది ప్ర కృతి సహజమైన శరీక ధర్మము . రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ లేదా ఇన్‌ఫ్రారెడ్ లేజర్ ద్వారా నాన్‌-సర్జికల్ స్కిన్‌ టైటనింగ్ చేయవచ్చు.
చర్మం బర్న్‌కాకుండా డీపర్ లేయర్స్ హీట్ చేస్తారు. .ఇది కొత్త కొలాజెన్‌ ఉత్పత్తి చేసి , పాత కొలాజెన్‌ ను టైట్ చేస్తుంది . దీనివల్ల చర్మము బిగుతుగా మారుతుంది . ఇవి సురచితమైన నొప్పిలేని చికిత్స . చికిత్స తర్వాత దైనందిన పనులు ఆరంబించవచ్చు . సూర్యరశ్మి సోకకుండా జాగ్రత్త తీసుకోవాలి .
  • *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Thursday, November 14, 2013

Is our hapyness in our hands?,సంతోషం మన చేతుల్లోనే ఉందా?

  •  



ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : సంతోషం మన చేతుల్లోనే ఉందా?

జ : చిన్న చిన్న సమస్యలకే చెదిరిపోవడం, ఒత్తిడికి గురవడం చాలామంది విషయంలో జరిగేదే. అయితే ఒక్కసారి ఎందుకలా జరుగుతోంది అని సమీక్షించుకుంటే పరిష్కారం లభిస్తుంది. ఆనందంగా ఉండటం సాధ్యమేనని అర్థమవుతుంది. జీవితంలో సంతోషంతో పాటూ కోపతాపాలూ, ఆశ నిరాశలూ ఉంటాయి. అది తెలుసుకోకుండా చిన్న విషయాలకే బాధపడుతుంటే ఆనందానికి ఆమడ దూరంలో ఉంటాం. సమస్యలూ, బాధలూ వచ్చి పోతుంటాయే తప్ప శాశ్వతం కాదని గుర్తించాలి. ప్రతికూల భావోద్వేగాలను ఎంత త్వరగా నియంత్రించుకుంటే అంతగా సానుకూల ఫలితాలు లభిస్తాయి. అలాగే ప్రతి ఒక్కరిలో బలాలూ, బలహీనతలూ ఉంటాయి. వాటిని సరిగ్గా అంచనా వేసుకుంటే సామర్థ్యానికి తగిన లక్ష్యాలను రూపొందించుకుని, విజయం సాధించడమూ సులువే. బలహీనతలను తగ్గించుకుంటూ బలాలను పెంచుకుంటూ ముందుకు సాగడమే గెలుపు సూత్రం అని వేరే చెప్పాలా!

ఏ పనిచేసినా అది ఆత్మవిశ్వాసాన్నీ, గౌరవాన్నీ పెంచేదిగా ఉండాలి. అయితే అతి విశ్వాసం మంచిది కాదు. 'నేను తప్ప ఆ పని ఎవరూ చేయలేరు' అనుకొనే అతి విశ్వాసం అన్నివేళలా సానుకూల ఫలితాలను ఇవ్వదు. సరికదా, కొన్నిసార్లు పని తక్కువ, డాంబికాలు ఎక్కువ అన్న పేరు తెచ్చి పెడుతుంది. ప్రతి పనికీ కచ్చితంగా ఒక సమయాన్ని నిర్దేశించుకొని అటో ఇటో తేల్చుకొనే చొరవా, తెగింపూ కొన్నిసార్లు అవసరమే. అది సానుకూల ఫలితం ఇవ్వకపోయినా బెంగపడాల్సిన పనిలేదు. వచ్చిన ఫలితాల్ని విశ్లేషించుకుని పొరబాట్లను సరిదిద్దుకుంటే అనుకొన్న లక్ష్యాలను చేరుకోవడం సాధ్యమే.
  •  *===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Wednesday, November 13, 2013

Is it good to use earbuds in children?,పిల్లలకు ఇయర్ బడ్స్ వాడడము వల్ల సమస్యలు ఉంటాయా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : పిల్లలకు ఇయర్ బడ్స్ వాడడము వల్ల సమస్యలు ఉంటాయా?.

జ : అస్సలు సురక్షితము కాదు .ఇయర్ బడ్ కాటన్‌ ఒక్కోసారి చెవిలో ఇరుక్కుపోవచ్చు  లేదా ఇయర్ బడ్ ని బాగా లోపలకు పుష చేయడము వలన చెవిలోపల గాయమై హాని జరుగవచ్చు . అంతే కాక దీనివల్ల చెవిలో పేదుకున్న మురికి ఇన్నర్ కెనాల్ లోకి బడ్ వల్ల వెళ్ళిపోయే అవకాశము ఉంది . . కనుక ఇయర్ బడ్ ను చెవి వెలుపల భాగాన్ని క్లీన్‌ చేయడానికి వాడాలి తప్ప లోపలికి పెట్ట కూడదు.  

*===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Monday, November 11, 2013

Is congenital Hydrocoel dangerous?,కంజెనిటల్ హైడ్రోసిల్ ప్రమాదకరమా?

  •  



ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .


Q : బాబు వయసు 2 సంవత్సరాలు. ఆరోగ్యంగానే ఉంటాడు కానీ ఎడమ వృషణం, దాని సంచి పెద్దవిగా ఉంటాయి. ఏడ్చినపుడు మరింత పెద్దదిగా కనిపిస్తోంది. నిద్రపోతున్నపుడు నార్మల్‌గానే అనిపిస్తోంది. మూత్ర విసర్జనలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది పుట్టుకతోనే ఉందేమోనని నా అనుమానం. మా బాబు సమస్య ఏమిటి? పరిష్కారం సూచించగలరు?

A : మీ అబ్బాయిలో ''కంజెనిటల్ హైడ్రోసిల్'' ఉందని అనిపిస్తోంది. పొట్టలో ఉండే పెరిటోనియల్ పొరలు వృషణాల చుట్టూ అమరికగా ఉంటాయి. ఈ రెండింటి మధ్యలో కనెక్షన్ పుట్టేటప్పటికే మూసుకుపోయి రెండూ వేర్వేరు కంపార్ట్‌మెంట్స్‌గా ఉంటాయి. ఒకవేళ ఈ కనక్షన్ మూసుకోకపోతే పొట్టలోని పెరిటోనియల్ ద్రవం, పేగులు గజ్జలగుండా వృషణాల వద్దకు చేరుతాయి. దీనిని నిర్ధారించిన తర్వాత సర్జరీ ద్వారా ఆ భాగాన్ని రిపేర్ చేస్తాం. తిరిగి రావడము(recurrence) సర్జరీ తరువాత అరుదు. ఎంత త్వరగా సర్జరీ చేయిస్తే అంత మంచిది.

*===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Sunday, November 10, 2013

Do we spend normal life after bypass surgery?,బైపాస్ సర్జరీ అయిన తరువాత మామూలుగానే ఉండవచ్చా?


  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .!



Q : -నాకు రెండేళ్ల క్రితం బైపాస్ సర్జరీ అయింది. ఇప్పుడు నేను మామూలుగానే ఉండవచ్చా? ఇంకా మందులు వాడుతూ జాగ్రత్తగానే ఉండాలా?

A : -సర్జరీ అయిన తరువాత చాలామంది పేషెంట్లు నిర్లక్ష్యం చేసేది మందులను టైమ్ ప్రకారం వాడరు. ఇక తగ్గిపోయింది కదా అని అంతగా శ్రద్ధ పెట్టరు. కానీ ప్రతిరోజూ ఉదయం, సాయం త్రం తప్పనిసరిగా మీ డాక్టర్ సూచనల మేరకు మందులు వాడుకోవాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువగా తీసుకోకూడదు. దానివల్ల గుండె మీద ఒత్తిడి పడుతుంది. తద్వారా ఛాతిలో నొప్పి, శ్వాసలో ఇబ్బంది రావచ్చు. మీరు షుగర్ పేషెంట్ అయితే డాక్టర్‌తో మాట్లాడి మందుల డోస్‌ను సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. షుగర్ పడిపోకుండా చూసుకోవాలి. లేకపోతే గుండెకు మళ్లీ సమస్య అవుతుంది.

*===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Does patient die with first heart attack?,మొట్టమొదటిసారి గుండెపోటు వల్ల మరణం సంభవించవచ్చా?

  •  



  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *


 Q : నాకు 58 ఏళ్లు. నా స్నేహితుడు ఇటీవలే గుండెపోటుతో మరణించాడు. అతనికి అన్ని పరీక్షల రిపోట్స్ నార్మల్‌గానే వచ్చినవి . మరి గుండెపోటు ఎందుకు వచ్చింది? మొట్టమొదటిసారి గుండెపోటు వల్ల కూడా మరణం సంభవించవచ్చా?


జ  : -గుండెపోటు హఠాత్తుగా కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారే ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు బీపీ పెరిగి గుండెకు రక్తసరఫరాలో అలజడి కలగవచ్చు. దాంతో సడెన్‌గా గుండెపోటు రావచ్చు. నాలుగైదుసార్లు గుండెపోటు వస్తేనే ప్రమాదం అనుకోకూడదు. గుండెపోటు ఒక్కసారి వచ్చినా కష్టమే. ఒక్కసారిగా పెద్ద గుండెపోటుతో హార్ట్ ఫెయిల్యూర్ కావడమో, హృదయ స్పందనలు గతి తప్పడమో జరిగి మరణం సంభవించవచ్చు.
  • ===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Do smoking cause heart attack?-పొగతాగితే గుండెపోటు తప్పదా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . *


Q : నా వయసు 38 సంవత్సరాలు. పొగతాగే అలవాటు ఉంది. నా తల్లిదంవూడులు ఇద్దరూ గుండెపోటుతో చనిపోయారు. ఇప్పుడు నాకు కూడా ఛాతిలో నొప్పిగా ఉంటోంది. పొగతాగేవాళ్లు అందరికీ గుండెపోటు రావడం లేదు కదా. మా నాన్నగారికి సిగట్ అలవాటు లేదు. మరి నాకెందుకు ఇలా...? నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?


Ans :
చాలామంది ధూమపాన ప్రియుల ఆలోచన ఇలాగే ఉంటుంది. కానీ గుండెకు ప్రథమ శత్రువు పొగాకే. పొగ తాగడం వల్ల వెంటనే ప్రభావం చూపించకపోయినా లోపల గుండె, ఇతర అవయవాలకు డ్యామేజీ మాత్రం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు ముందుగా వెంటనే సిగట్లు మానేయాలి. మీ ఛాతినొప్పి ఏ రకంగా ఉందో మీరు వివరించలేదు. గుండెనొప్పే అయితే మాత్రం నొప్పి ఛాతి నుంచి పక్కకి, వెనక్కి అలా వ్యాపిస్తూ ఉంటుంది. పని చేసినప్పుడు నొప్పి ఎక్కువ అవుతుంది. మీరు వెంటనే కార్డియాలజిస్టును కలిసి ఈసీజీ చేయించుకోండి. అవసరాన్ని బట్టి ఎకో, ఇతర పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. బీపీ, కొలెవూస్టాల్, షుగర్ పరీక్షలు కూడా ఒకసారి చేయించుకోండి. పరీక్షల ఫలితాలను బట్టి చికిత్స మొదలుపెడతారు. రోజూ వ్యాయామం లేదా 40 నిమిషాల వాకింగ్ తప్పనిసరిగా చేయాలి. బరువు పెరగకుండా చూసుకోవాలి.
  • ==============================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -