Q : నా వయసు 38 సంవత్సరాలు. పొగతాగే అలవాటు ఉంది. నా తల్లిదంవూడులు ఇద్దరూ గుండెపోటుతో చనిపోయారు. ఇప్పుడు నాకు కూడా ఛాతిలో నొప్పిగా ఉంటోంది. పొగతాగేవాళ్లు అందరికీ గుండెపోటు రావడం లేదు కదా. మా నాన్నగారికి సిగట్ అలవాటు లేదు. మరి నాకెందుకు ఇలా...? నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Ans : చాలామంది ధూమపాన ప్రియుల ఆలోచన ఇలాగే ఉంటుంది. కానీ గుండెకు ప్రథమ శత్రువు పొగాకే. పొగ తాగడం వల్ల వెంటనే ప్రభావం చూపించకపోయినా లోపల గుండె, ఇతర అవయవాలకు డ్యామేజీ మాత్రం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు ముందుగా వెంటనే సిగట్లు మానేయాలి. మీ ఛాతినొప్పి ఏ రకంగా ఉందో మీరు వివరించలేదు. గుండెనొప్పే అయితే మాత్రం నొప్పి ఛాతి నుంచి పక్కకి, వెనక్కి అలా వ్యాపిస్తూ ఉంటుంది. పని చేసినప్పుడు నొప్పి ఎక్కువ అవుతుంది. మీరు వెంటనే కార్డియాలజిస్టును కలిసి ఈసీజీ చేయించుకోండి. అవసరాన్ని బట్టి ఎకో, ఇతర పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. బీపీ, కొలెవూస్టాల్, షుగర్ పరీక్షలు కూడా ఒకసారి చేయించుకోండి. పరీక్షల ఫలితాలను బట్టి చికిత్స మొదలుపెడతారు. రోజూ వ్యాయామం లేదా 40 నిమిషాల వాకింగ్ తప్పనిసరిగా చేయాలి. బరువు పెరగకుండా చూసుకోవాలి.
- ==============================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.