* సాధారణ కాన్పు అయిన ఆరు వారాల నుంచి మళ్లీ శృంగారంలో పాల్గొనవచ్చు. సిజేరియన్ అయిన మహిళల్లో ఈ సమయం 8 నుంచి 12 వారాలదాకా ఉంటుంది.
* కొందరు మహిళలు అప్పటికి కూడా మానసికంగా శారీరకంగా శృంగారానికి సంసిద్ధమై ఉండకపోవచ్చు. ఆ విషయాన్ని భర్త అర్థం చేసుకోవాలి. ఇంకొందరిలో ప్రసూతి వైరాగ్యం (పోస్ట్‌నేటల్ డిప్రెషన్) వల్ల శృంగార కోరికలు అంతగా కలగవు. అలాంటి సమయాల్లో వైద్యుల కౌన్సెలింగ్ తీసుకుంటే సమస్య పరిష్కారమవుతుంది.
* గర్భధారణ సమయంలో రకరకాల కారణాల వల్ల మహిళల పొత్తికడుపు కండరాలు చాలావరకూ బలహీనపడతాయి. వైద్యుల సలహాతో పెల్విక్‌ఫ్లోర్ ఎక్సర్‌సైజులు చేస్తే ఈ ఇబ్బందిని అధిగమించవచ్చు. తద్వారా శృంగారానికి ధీమాగా సమాయత్తం కావొచ్చు.
* ప్రసవానంతరం జరిగే తొలి కలయికలో భర్త చాలా సున్నితంగా ప్రవర్తించాలి. భార్య పొత్తికడుపుపై ఒత్తిడి కలగకుండా చూసుకోవాలి. స్త్రీ పైన పురుషుడు కింద ఉండే భంగిమతో ఈ సమస్యను అధిగమించవచ్చు.
- =================================================
visit my website - > Dr.Seshagirirao-MBBS
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.