- ఒకసారి వేరుచేసి తిరిగి జతచేసిన ట్యూబులు కనీసం 6 - 7 సెంటీ మీటర్లు పొడవు ఉండాలి .
- జతచేసిన బాగాలు రెండు వైపులా సరిగా అమరాలి .
- ఇన్ఫెక్షన్ రాకూడదు ,
- అండోత్పత్తి జరుగుతూ ఉండాలి ,
- భర్త స్పెర్మ కౌంట్ సరిపడినంత ఉండాలి .
------------------------
Q : నా వయసు 29. ఇద్దరు పిల్లలు. ఆరేళ్ల క్రితం పిల్లలు వద్దనుకొని ఆపరేషన్ చేయించుకున్నాను. అయితే రెండేళ్ల క్రితం మా పెదబాబు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఇప్పుడు చిన్నబాబు లోన్లీగా ఫీలవుతున్నాడు. బాబో, పాపో ఇంకొకరుంటే బాగుండు అనిపిస్తుంది. అప్పుడు పిల్లలు వద్దని ఆపరేషన్ చేయించుకున్నాను కదా, ఇప్పుడు పిల్లలు పుట్టడానికి మళ్లీ ఆపరేషన్ చేయించుకోవచ్చా? ఆరోగ్యరీత్యా ఇదేమైనా సమస్యగా మారుతుందా? తెలుపగలరు.
- భవాని, ఇ-మెయిల్
A : స్ర్తీలలో విడుదలయ్యే అండం గర్భసంచి పక్కనే ఉన్న అండాశయం నుంచి నెలకొకటి రిలీజ్ అవుతుంటుంది. ఇది అండాశయం నుంచి ఫెలోపియన్ ట్యూబ్స్ ద్వారా ప్రయాణించి గర్భసంచికి చేరి అక్కడ ఫలదీకరణం చెందడం వల్ల గర్భం నిర్ధారణ అవుతుంది. కాని ఫెలోపియన్ ట్యూబ్స్ ఇన్‌ఫెక్షన్ వల్ల, మ్యూకస్ వల్ల, ఇతర సమస్యల వల్ల మూసుకుపోతాయి. అలాంటప్పుడు ఇక అండం గర్భసంచికి చేరే మార్గం ఉండదు. దీని వల్ల గర్భం రాదు. సర్జరీ ద్వారా ఒకసారి మూసివేసిన ట్యూబ్‌ని తిరిగి ఓపెన్ చేయడాన్ని రీకెనలైజేషన్ అంటారు. ఇది చాలా సున్నితమైన ఆపరేషన్. ఇది చెయ్యడానికి ముందు మీకు ఇతర ఆరోగ్యసమస్యలు ఏమైనా ఉన్నాయా? పొత్తికడుపుకు సంబంధించిన ఆపరేషన్లు ఏమైనా అయ్యాయా? ఇన్‌ఫెక్షన్లు, టీబీ వంటివి ఏమైనా వచ్చాయా? ట్యూబెక్టమీ ఆపరేషన్ డెలివరీ అయిన వెంటనే చేశారా? లేక కొద్దికాలానికా? అలాగే అది ఓపెన్ సర్జరీనా? లేక లాప్రోస్కోపిక్ సర్జరీనా? వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. రీకెనలైజేషన్ ఆపరేషన్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ తప్పకుండా వస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు. కొన్ని సందర్భాలలో ట్యూబల్ ప్రెగ్నెన్సీ రావచ్చు. ట్యూబ్స్ మళ్లీ అతుక్కుపోవచ్చు. వీటన్నింటికీ మీరు సమ్మతిస్తే అప్పుడు లాప్రోస్కోపీ చేసి ... గర్భసంచి ఎలా ఉంది? ట్యూబ్స్ కండిషన్ ఎలా ఉంది? ట్యూబెక్టమీ అప్పుడు ఎంత ట్యూబ్ కట్ చేశారు? వంటి అంశాలను చెక్ చేస్తారు. వాటన్నింటి తర్వాతే సర్జరీ చేస్తారు. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని డాక్టర్ని సంప్రదించి, వారి సలహా పొందండి.
========================================================
visit my website - > Dr.Seshagirirao-MBBS
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.