Saturday, May 9, 2015

పెదవుల కార్న్‌ర్స్ డార్క్ గా కొంచం పీలింగ్ స్కిన్‌ తో ఉంటాయి.కారణమేమిటి?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : నా పెదవుల కార్న్‌ర్స్ డార్క్ గా , కొంచం పీలింగ్ స్కిన్‌ తో ఉంటాయి . ఇది ఎలర్జిక్ రియాక్షనా?

జ : ఇందుకు కొన్ని కారణాలు దారితీయవచ్చు ... టూత్ పేస్ట్ , లిప్ స్టిక్ ఎలర్జీ కావచ్చు . ViTamin 'B లేదా ఐరన్‌ లోపము కావచ్చు . పెదవులు కొరికే అలవాటు కనుక ఉంటే పొడిబారడం వల్ల కుడా ఇలా జరుగ వచ్చు. కొన్నిసార్లు వారసత్వ కారణమూ ఉంటుంది. ్

పెదవులు కొరుక్కోవద్దు . కొన్నాళ్ళపాటు లిప్ స్టిక్ మానేయండి . పెదవులు పొడిబారుతుంటే లిప్ బాం లేదా నెయ్యి వాడడం మంచిది. రోజుకు రండుసార్లు మాయిశ్చరైజింగ్ క్రీమ్‌ వాడడము వల్ల కార్నర్స్ హైడ్రేట్ అవుతాయి. మెంథాల్ , మింట్ , ఇతరత్రా ఆల్కహాల్ బేస్ గల లిప్ గ్లాసులు లేదా టూత్ పేస్ట్ లు వాడవద్దు . మరీ ఎక్కువ ఇన్‌ప్లమేషన్‌ ఉన్నట్లైతే డెర్మటాలజిస్ట్ ని సంప్రదించండి .
  •  *===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Monday, May 4, 2015

Hyperhydrosis-నా అరచేతులు పాదాలు ఎక్కువ స్వేదము పడుతున్నాయెందుకు?

  •  
  • ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
  •  
  •  

ఫ్ర : నా అరచేతులు పాదాలు ఎక్కువ స్వేదము పడుతున్నాయి. దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంటున్నది .ఏం చేయాలి?

జ : అరికాలు , అరిచేతులు లలో ఎక్కుమ చెమట పట్టడాన్ని " హైపర్ హైడ్రోసిస్ ('Hyper Hydrosis)అంటాము. సాధారనముగా ఇది " ఇడియోపతిక్ -'Idiopathic . కొన్నిసార్లు ఇతరత్రా ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూదా ఇలా జరుగవచ్చు. దీనివలన చెప్పులతో నడవడము కష్టము గా ఉంటుంది. కొంతమంది ఎక్కువ నెర్వస్ గా ఉంటారు .. దీనే 'anxiety 'neurosis అంటాము. వీరిలో కూడా హైపర్ హైడ్రోసిస్ ఎక్కువగా ఉంటుంది. వీరు నిరంతరము 'sacks వేసుకుని సరియైన పాదరక్షలు తో నడుస్తూ ఉంటారు.

ట్రీట్మెంట్ : 20% అల్ల్యుమినియం క్లోరైడ్ హెక్సాహైడ్రేట్ సొల్యూసన్‌ -యాంటీస్వెట్ సొల్యూసన్‌ క్రమము తప్పకుండా పాదాలకు ,అరిచేతులకు రాస్తూఉండాలి. బొటాక్ష్ ఇంజక్షన్స్ లు కూడా తీసుకోవచ్చు. వీటి ప్రభావము 4-6 గంటలు ఉంటుంది. ఏది ఏమైనా ముందుగా చర్మసంబంధిత వైద్య నిపుణుల సలహా తీసుకోవడము మంచిది.

*===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Friday, April 17, 2015

He likes but keeping away?-ఇష్టమంటూనే... దూరంగా ఉంటుంటే?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర: మాకు రెండేళ్ల క్రితం పెళ్లయింది. మా వారికి నేనంటే చాలా ఇష్టమని ఆయనే చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ నాతో సన్నిహితంగా ఉండరు. కలయిక అంటే ఇష్టమంటారు కానీ చొరవ చూపించరు. దాంతో మేమిద్దరం కలయికలో పాల్గొంది చాలా తక్కువ సందర్భాల్లోనే. కారణం తెలుసుకునేందుకు చాలాసార్లు ప్రయత్నించా. కానీ సమాధానం లేదు. ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో తెలియడం లేదు!
- ఓ సోదరి
జ. మీకూ, మీ భర్తకూ మధ్య గతంలో ఏవయినా సమస్యలు ఎదురై.. వాటిని పరిష్కరించుకోకుండా వదిలేశారా.. ఒకసారి ఆలోచించుకోండి. లైంగికచర్యకూ, లైంగికంగా సన్నిహితంగా ఉండటానికీ చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా ఇద్దరిమధ్యా స్పష్టమైన భావవ్యక్తీకరణ, ఉద్వేగాల పరంగా ఒకరినొకరు పూర్తిగా అర్థంచేసుకోవడం, అభిప్రాయాలు.. వీటిల్లో ఏదో ఒకటి సమస్యకు మూల కారణం అవుతుంది. మీ విషయంలోనూ అదే జరుగుతోంది. మీరు మీ భర్తతో చాలాసార్లు మాట్లాడానన్నారు. కానీ లైంగికజీవితం గురించి సూటిగా, నిజాయతీగా చర్చించారా అన్నది గుర్తుచేసుకోండి. ఇప్పుడు మరోసారి మాట్లాడండి. ఆయన ఏదయినా విషయానికి సంబంధించి బాధపడుతున్నారా లేదా గతంలో జరిగిన సంఘటనలకు సంబంధించి అపరాధభావనకు లోనవుతున్నారా అన్నది తెలుసుకునే ప్రయత్నం చేయండి. మరికొన్నిసార్లు అసలు లైంగికచర్యనే వద్దనుకోవచ్చు.. ఆ అనుబంధం లేకుండా కూడా ఆనందంగా జీవించొచ్చు అని మీకు తెలియజేయాలనుకుంటున్నారేమో...ఈ కారణాలు ఉన్నా లేకపోయినా కూడా మీవారిపై కలయికపరంగా ఒత్తిడి తేవడం, పదేపదే ఆ విషయాన్ని చర్చించకుండా, ముందు మీ మధ్య సాన్నిహిత్యం పెరిగేలా చేసుకోండి. అప్పుడే నిజాయతీగా సమస్యను వివరిస్తారు.

--డా .షర్మిళా మజుందార్

  •  *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Saturday, January 3, 2015

Pillow dust is cause for Asthma?, తలగడ దుమ్ము వలన ఆస్తమా వస్తుందా?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
  •  
  •  

 ప్ర : తలగడ దుమ్ము వలన ఆస్తమా వస్తుందా?

జ : వస్తుంది. మెత్తటి తలగడ వుంటే సుఖముగా , హాయిగా నిద్ర పడుతుంది. తలగడ లేనిదే సౌకర్యము స్వంతము కాదు . మంచినిద్రకు ఇదెంత అవసరమో ... దానిపట్ల జాగ్రత్తలు తీసుకోవస్లసిన అవసరమూ అంతే ఉంటుంది. 6 నెలలు వాడేశాక తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ... మొటిమలు , ఎలర్జీలకు  సదరు దిండే కారణమవుతుంది . బాగా పాతదిండ్లపై తల  పెట్టి పడుకోవడము వల్ల వాటిలోని దుమ్ము , జిడ్డు , మృతకణాలు వంటివన్నీ వెలికి వచ్చి మొటిమలకు కారణమవుతాయి .

డస్ట్ మైట్స్ కూడా  వీటిలో నివాసము ఏర్పరచుకుంటాయి. వీటివల్ల ఆస్త్మా , ఎలర్జీ , ఇతర రియాక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎలర్జీలల్తో 20 శాతముమంది బాధపడుతున్నారంటే వారిలో మూడింట రెండు వంతులు మందికి బెడ్స్ లోనివసంచు డస్ట్ మైట్సే కారణమవుతుంటాయి. ప్రతి వారము ఎండలో ఆరబెడుతూ ఉండాలి.
  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Friday, December 26, 2014

Is there Age increasing hormone present?,ఆయుర్ధాయము పెంచే హార్మోన్‌ ఉంటుందా?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : మనిషి ఆయుర్ధాయము పెంచే హార్మోన్‌ ఉంటుందా?

  • జ : మనిషి ఆయుర్ధాయము పెంచే హార్మోన్‌ మానవ శరీములో నే తయారవుతుంది. మానవ  శరీరము లో ఉన్న వినాళగ్రంధులలో ఎడ్రినల్ గ్రంధి ఒకటి .. మూత్రపిండం మీద టోపీలాగా కూర్చుని కనిపించే ఈఅ గ్రంధి స్రవించే అనేక హార్మోనులలో డి.హెచ్.ఇ.ఎస్.( ACTH-dependent. hormone,. DHEA,. also. known. as. DHES-sulfate.) అనే హార్మోన్‌ జీవితం ఆయుర్ధాయం ను పెంచుతుంది. అయితే ఈ హార్మోన్‌ స్రవించడము అందరిలో ఒకేలా ఉండదు . 
  • ఎవరైతే సంపూర్ణ పోషకపదార్ధాలను తీసుకుంటారో , 
  • ఎవరైతే క్రమము తప్పకుండా వ్యాయామను చేస్తారో , 
  • ఎవరికైతే ఇష్టపడి చేసే వ్యాపకాలు ఉంటాయో, 
  • ఎవరిలో అయితే మానవ సంబంధాలు మెరుగా ఉంటాయో , 
........... వారిలో మాత్రమే ఈ హార్మోన్‌ ఉత్పత్తి అవుతుంది. అంటే ఈ హార్మోన్‌ ఉత్పత్తికి మానసిక స్థితికి ఎంతో దగ్గర సంబంధము ఉంది. సక్రమైన మానసిక స్థాయి, ఒత్తిడులకు  గురికాని వారి  ఆయుర్ధాయాన్ని పెంచుతుంది. 

  • *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Thursday, December 18, 2014

పిల్లలలో గోళ్ళు కొరికే అలవాటును నియంత్రించడమెలా?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : పిల్లలలో గోళ్ళు కొరికే అలవాటును నియంత్రించడమెలా?

జ : ఇది పిల్లలలో అత్యంత సర్వసాధారణముగా కనిపించే గుణము . పిల్లలు ఈ విధమౌగా గోళ్ళు ఎందుకు కొరుతారనడానికి అనేక కారణాలు ఉంటాయి.
  • ఒత్తిడి నుండి ఉపసమనము కోసము కావచ్చు 
  • అలవాటు గానో కావచ్చు , 
  • ఎవరినైఅనా అనుకరిస్తూనో చేయవచ్చు ,
  • ఖాళీ గా  ఏమీ తోచకుండా ఉన్నప్పుడు ఈ పని చేయనూ వచ్చు.
చిన్నతములోనే అలవాటు తొలిదశలోనే అడ్డుకోకపోతే ఎదుగుతున్నా ఆ అలవాటు మానరు . పిల్లలిలా గోళ్ళు కొరకడానికి గల కారణాన్ని తెలుసుకోవాలి . ఒత్తిడి లేదా యాంగ్జైటీ ఉండి ఉంటే అదెందువల్లనో గుర్తించాలి.  పరీక్షల భయము , స్నేహితుల ఒత్తిడి , కుటుంబసబ్యులలో లేదా స్కూల్లో తోటి పిల్లలతో తగాదాలు వంటివి కారనమైతే ... ఆ దిశగా పిల్లల యాంగ్జైటీని తగ్గించే ప్రయత్నాలు చెయ్యాలి.  ఓ అలవాటుగా చేస్తుంటే ఇదెంతటి దురలవాటో , దీనివల్ల ఎటువంటి అనారోగ్యాలు వస్తాయో, పిల్లల పట్ల  ఎదుటివారి అభిప్రాయము ఏవిధముగా ప్రభావితము అవుతుందో వారికి వివరించాలి .బలవంతము గానో , పనిష్మెంట్ల భయం తోనో కాక అవగాహనతో మానిపించే దిశగా ప్రయత్నించాలి. పనిష్మిమెంట్లు ఇవ్వడము వల్ల పిల్లలు గోళ్లు కొరకడాన్ని మానకపోగా ఇంకా ఎక్కువ చేస్తుంటారు. అలాగే వేళ్ళకు చేదు రాయడము వంటివి చేయకూడదు ఇతరత్రా పనులలో వారిని ఎంగేజ్ చెయ్యడము వల్ల వారికి గోళ్ళు కొరుక్కోవాలన్న తలంపు రాదు .

  • *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Thursday, December 11, 2014

foods to eat for controle weight gain?,బరువు పెరగ కుండా ఆహారపదార్ధాలు ఏవిధము గా తినాలి ?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : బరువు పెరగ కుండా మంచి ఆరోగ్యము కోసము ఆహారపదార్ధాలు ఏవిధము గా తినాలి ?.

జ : కొద్దికొద్దిగా తినండి . ముఖ్యము గా ఆరోగ్యకరం కాని వాటి విషయము లో ఈ నియమాన్ని తప్పకుండా పాటించాలి. చీజీ , పిజ్జాల వంటి వాటిని పూర్తిగా ఆహారము నూడి తీసెయ్యాలి . కొద్ది గా ఎప్పుడైనా తినవచ్చు. పూర్తిష్థాయి  ధాన్యాలు , గింజలు , పప్పులు వంటి కాంప్లెక్స్ కార్భోహైడ్రేట్స్ ను ఎక్కువగా తీసుకోవచ్చు.

పండ్లు , కూరగాయలు  ఎక్కువగా తినాలి. చెక్కెర పదార్ధాలు , రిఫైండ్ ఉత్పత్తులు పరిమితముగా తినాలి. రోజుకి సుమారు 2 లీటర్ల నీటిని తాగాలి. ప్రతిరోజూ 30 నుండి 60 నిముషాలు పాటు వ్యాయామము చేయాలి. ఇలా ఆరోగ్యవంతము కాని పదార్ధాలు తక్కువగా తింటూ, ఆరోగ్యవంతమైనవి అధికమౌగా తింటూ చురుకైన జీవన విధానము అనుసరించినంత కాలము బరువు పెరగరు.

  •  *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Tuesday, December 9, 2014

Sleep disturbences in Pregnency ?,గర్భిణి లలో తరచు రాత్రులలో మెలకువ వచ్చేస్తుందెందుకు ?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : నేను 7 వ నెల గర్భవతిని. రాత్రివేళ చాలా సార్లు మెలుకువ వచ్చేస్తుంటుంది . బరువు మోయలేనట్లు గాను , అలసటగాను ఉంటుంది. ఏమి చేయాలి ? 

జ : అవకాశము , వీలుకలిగినప్పుడల్ల ఎంతోకొంత విశ్రాంతి తీసుకోండి . రాత్రి భోజనము చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమించవద్దు. 5 నిముషాలు నడవాలి. ఒకవేళ రాత్రిల్లు తక్కువ నిద్ర పోయినప్పటికీ అందోళన చెందవద్దు . . ఊరికే అలా కళ్ళుమూసుకొని పడుకొని శరీరానికి అవసరమైన స్థాయిలో రెస్ట్ తీసుకుంటూ ఉండాలి.

బి.ప్. , సుగరు వ్యాధులు ఉన్నాయేమో తనికీ చేయించుకోవాలి. కాలు వాపులు (పొంగులు) ఉండకూడదు. మూతములో ఆల్బుమిన్‌ పోతుందేమో తనికీ చేయిందుకోవాలి. రక్తహీనత ఉందేమో హీమోగ్లోబిన్‌ తనికీ చేయిందుకోవాలి. వీటిలో ఏది ఉన్నా మీకు ఆయాసము , బరువుగా ఉన్నట్లు అనిపించును.  మంది డాక్తర్ ని సంప్రదించి తగిన మందులు వాడాలి. గుర్రపు వాతము ('elcampsia ) రాకుండా జాగ్రత్త పడాలి.

  •  *===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Do we not use vitamin tablets?,విటమిన్‌ మాత్రలు వేసుకోకూడదా?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము
  •  

  •  

ప్ర : మా ఫామిలీ డాక్టర్ మల్టీవిటమిన్‌ మాత్రలు ఎక్కువగా వాడకూడదని అన్నారు. మనము విటమిన్‌ మాత్రలు వేసుకోకూడదా?

జ : విటమిన్‌ మాత్రలు మన శరీర ఆరోగ్యాన్ని కాపాడుతాయి. వాటి లేమి శరీరము నకు  అనేక రోగాలకు  తట్టుకునే శక్తి ఉండదు. అయితే వైద్యులు చెప్పకుండా విటమిన్‌ మాత్రలు వేసుకోకూడదు. విటమిన్లు శరీరానికి అవసరమే కాని వాటిని మితముగా అవసరమున్నంతవరకే వాడాలి. విటమిన్ల లో నీటిలో కరిగేవి , నూనెలో కరిగేవి అని రండురకాలు . .   'A,'D,'E అనేవి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్లు అతిగా వేసుకుంటే శరీరానికి ఇబ్బందులు తప్పవు . ఇవి ఎక్కువగా తింటే కాలేయములో నిలువచేయబడి శరీరము మీద వ్యతిరేక ప్రభావము చూపుతాయి.
  • జుట్టు రాలిపోవడము,
  • ఆకలి మందగించడము ,
  • ఎకుకల నొప్పులు , 
  • కొన్ని సమయాలలో లివర్ క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశము , ఉంటుంది.
నీటిలో కరిగే విటమిన్లు ఎక్కువగా వాడినా  ... అవి మూత్రము ద్వారా విసర్జించబడి నందున సైడు ఎఫెక్ట్ (వ్యతిరేక ప్రబావము) ఉండదు . వీటిని అంటే 'B,'C, విటమిన్లను  వాడుకోవచ్చును.

అందువలన మల్టీవిటమిలు ఎలాబడితే అలా  వేసుకోవద్దు . మంచిది కాదు.

  • *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Monday, December 8, 2014

How to remove Spots on teeth ?,పళ్ళపై మరకలు పోయేదెలా?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
  •  

ప్ర : పళ్ళపై మరకలు పోయేదెలా?

జ : పళ్ళ గురించి ఎంతగా శ్రద్ద వహించినా పడిన మచ్చలు , గార తొలగదు . అందుకు సరియైన జాగ్రత్తలు తీసుకుని కొన్ని కిటుకలు పాటిస్తే తొలగించుకోవడము సులువవుతుంది.  కాఫీ , టీ , వైన్‌, సోడా అలవాటు మచ్చల కి , గారకు దారితీస్తుంది . వీటిని కొన్ని గృహచికిత్సలతో తొలగించుకునే వీలు ఉన్నది.
1.స్ట్రాబెర్రీలలో ఉండే మాలిక్ యాసిడ్ ప్రభావ వంతమయిన టీత్ -వైట్నింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. స్ట్రాబెర్రీలు చిదిమి , ఆ గుజ్జుతో ముందుగా బ్రెష్ చేసి తరువాత టూత్ పేస్ట్ వాడాలి. ఇలా వారానికి కనీసము ఒకసారైనా చేస్తుండాలి . ఎక్కువసార్లు చేస్తే దీనిలోని యాసిడ్ పంటిపై ఉండే ఎనామిల్ కు హాని కలిగిస్తుంది.
2.బేకిగ్ సోడాలొ టూత్ బ్రెష్ అద్ది బ్రెష్ చేసుకుని తరువాత సాధారణ పేస్ట్ తో పళ్ళు తోముకోవాలి.  ఎప్పుడైనా నిమ్మరసము చుక్కలు వేసినా ఫలితము బాగుంటుంది.
3 . నెలకోసారి ఉప్పు , బేకింగ్ సోడా నీరు  కలిపి బ్రెష్ చేసుకుంటే పళ్ళు తెల్లగా ఉంటాయి. మరీ గట్టిగా రుద్దకూడదు.
4. ఇప్పుడు మార్కెట్ లో లభిస్తున్న కొన్నిరకాల వైట్నింగ్ టూత్ పేస్టులు కూడా ఉన్నాయి.

  • *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -