Friday, August 15, 2014

Milk-teeth not fallen why?,పాల పళ్ళు ఊడలేదు.ఏదైనా లోపానికిది సూచనా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : మా బాబుకు 13 ఏళ్ళు ... ఇంకా కొన్ని పాల పళ్ళు ఊడలేదు . ఏదైనా లోపానికిది సూచనా?

జ : ఈ వయసులో పాలపళ్లు ఊడడమనేది సర్వసాధారణము . కొంతమందిలో అవి అన్ని ఊడకుండా ఉన్నాయంటే... " ఎక్టోడెర్మల్ సిస్ ప్లాసియా " అన్న కండిషన్‌ వల్ల ఇలా జరుగుతాయి. ఒక్కొక్క సారి ఇటువంటి సమస్య ఉన్నప్పుడు  అసాధారణ ముఖ కవళికలు కూడా ఉండవచ్చు. 7-8 సం.ల వయసులో డైట్ లో చాలినంత క్యాల్సియం లేకపోవడం వలన ఈ సమస్య వచ్చి ఉండవచ్చును. ఆహారములో పాలు , పెరుగు వంటివి కనీసం 500 మి.లీ. అయినా ఉండే మాదిరిగా శ్రద్ద తీసుకోవాలి. డెంటిస్ట్ ని కలిని ఊడని పళ్ళ గురించి సలహా తీసుకోంది.
  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Heavy menstrual flow Why?,ఋతుశ్రావము తీవ్రముగా ఉంటుందేమి?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : నాకు ఋతుశ్రావము తీవ్రముగా ఉంటుంది , బరువుకూడా పెరుగుతున్నాను . పరీక్షలు చేయించుకుంటే థైరాయిడ్  హార్మోన్‌ తక్కువగా ఉందని అన్నారు . హార్మోను జీవితకాలము తీసుకోవలసిందేనా?

జ : థైరాయిడ్ హైపోఫంక్షన్‌ అనేది చాలా సాధారణ కండిషన్‌ . చిన్న థైరాయిడ్ హార్మోన్‌ టాబ్లెట్ సంప్లమెంట్ ఇస్తారు. డోసు థైరాయిడ్ హార్మోన్‌ స్థాయిని బట్టి సూచిస్తారు. . ఇది చాలా సురక్షితమైన మందు. వైద్యుని పర్యవేక్షణలో ఉండాలి . 3-4 నెలలకొక సారి థైరాయిడ్ హార్మోను స్థాయిలను పరీక్షించుకోవాలి . . . దానిని బట్టి మీరు తీసుముంటున్న మెడిషన్‌ మోతాదు సరిపోతుందో లేదో డాక్టర్ సలహా తో సరిచూసుకుంటూ ఉందాలి .
  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Friday, August 8, 2014

మా బాబు కి జాండిస్ వచ్చింది. ఏవిధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర :  మా బాబు వయసు 8 సం.లు ... ఈ మధ్య జాండిస్ వచ్చింది. ఏవిధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ?.

జ : మీ అబ్బాయికి " హెపటైటిస్ ఏ " అయిఉండవచ్చును . ఇది మన దేశములో సాదారణ వ్యాధి . ముందుగా వ్యాక్సిన్‌ తీసుకోవడము ద్వారా అరికట్టవచ్చును. ఒకసారి వచ్చాక . . . కోలుకుంటున్నప్పుడు హెపటైటిస్ ' ఎ " వ్యాక్సిన్‌ ఇవ్వాల్సిన అవసరము ఏమాత్రమూ లేదు. కాని మూడు డోసుల  హెపటైటిస్ " బి " వ్యాక్సిన్‌ షెడ్యూల్ ప్రకారము వేయించడము మంచిది.  హెపటైటిస్ " ఇ " ప్రమాధకరమైనది . ఇది మన దేసములో అరుదుగా కనిపిస్తుంది.
  • *=========================== 

visit my website - > Dr.Seshagirirao-MBBS -

Care in Menopause period,ఏడాది గా ఋతుక్రమము ఆగిపోయింది.ఏవిధముగా కేర్ తీసుకోవాలి?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
 ప్ర : నాకు 48 సం.లు ఏడాది గా ఋతుక్రమము ఆగిపోయింది. హార్మోనులు తీసుకో్వడము నాకు ఇస్టములేదు . ఇతర ప్రత్యామ్నాయ పద్దతుల ద్వారా ఏవిధముగా కేర్ తీసుకోవాలి?

జ :
మెనోపాజ్‌ ఆడవారి జీవితాన్ని చికాకుగా తయారు చేస్తుంది. పెరుగుతున్న వయసులో వచ్చే 'మెనోపాజ్‌' ఓ గ్రీకు పదం. మెనో అంటే 'నెల' అని, పాజ్‌ అంటే 'ఆగి' పోవటమని అర్థం. అంటే నెల నెల వచ్చే ఋతుక్రమం ఆగిపోవడమన్నమాట.

45--50 సంవత్సరాల వయసు మహిళల్లో పీరియడ్స్‌ సరైన సమయంలో రావు. అండాశయం నుండి అండాలు వెలువడటం ఆగిపోతుంది. కొన్ని నెలల పాటు పీరియడ్స్‌ ఆగిపోతాయి. స్త్రీలోని సెక్స్‌ హోర్మోన్స్‌ ఉత్పత్తి కూడా ఆగిపోతుంది.

ఇది ఆడవారి జీవితంలో అందరూ పొందే సామాన్య స్థితే. దీనివల్ల ఓవరీస్‌ నుండి వెలువడే అండోత్పత్తి సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయి క్రమంగా ఈస్ట్రోజెస్‌ (స్త్రీ సెక్స్‌ హోర్మోన్స్‌) ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోతుంది.

మహిళల శరీరములో మెనోపాజ్ అనేది సహజము గా జరిగే ప్రక్రియ .ఈస్ట్రోజన్‌ తగ్గడము వల్ల వెజినల్ డ్రైనెస్ ఉంటుంది. కొందరు మహిళలో హాట్ ప్లషెస్ కూడా ఉంటాయి. ఆస్టియోపొరోసిస్ అవకాశాలూ ఉంటాయి. హాట్ ప్లషెస్ , మూడ్ స్వింగ అనృవి ఆ యా మహళల ప్రాధమిక ఎమోషనల్ పర్సనాలిటీకి బావోద్వేగానికి సంబందించినవి .కొందరు బాగా ఇబ్బందిపడితే , ఇంకొందరుకి ఎటువంటి సమస్యలూ లేకపోవచ్చు ను . భాగా యాంజైటీ గా ఉండే గుణము కలవారయితే...తప్పనిసరిగా అభద్రతగా ఫీలవుతారు. ఈస్ట్రోజన్‌ తీసుకోవడానికి , తీసుకోలేనివారికి పెద్ద వ్యత్యాసమేమీ ఉండదు . అయితే భాదలు బరించరాని పరిస్థితి అయితే రిప్లేస్ మెంట ట్రీట్మెంట్ ఇవ్వవలసి ఉంటుంది. ఈస్ట్రోజన్‌ కి అనేక హెర్బల్ ప్రత్యాయాలు ఉన్నాయి.

మెనోపాజ్‌ లక్షణాలు ఇలా కూడా వుండే అవకాశం వుంది.

  • రాత్రి నిద్ర పట్టకపోవటం,
  • చెమట పట్టటం,
  • ఆకస్మికంగా గుండె,
  • మెడ, ముఖం మీద ఎరుపుదనం రావటం,
  • వేడిగా అనిపించటంలాంటి ముఖ్య లక్షణాలు మెనోపాజ్‌లో కనిపిస్తాయి.
  • ఈ సమయంలో యోని ద్వారం ఎండిపోయినట్టుగా ఉంటుంది.
  • యోని చర్మం పల్చగా ఉంటుంది. ఈ కారణాల వల్ల యోని మూత్ర విసర్జన నాళంలో అంటు రోగాలు వ్యాపించే అవకాశముంటుంది.

*===========================

visit my website - > Dr.Seshagirirao-MBBS -

Thursday, August 7, 2014

ముఖం మీద పల్చని ఫ్యాచ్ లు ఎందుకు వస్తున్నాయి? ఏం చేయాలి?.

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : నాది పొడిచర్మము కాదు . . . కాని చలిగాలులు మొదలవగానే ముఖం మీద పల్చని ఫ్యాచ్ లు కనిపిస్తున్నాయి. ఎందుకిలా వస్తున్నాయి? ఏం చేయాలి?.
జ:మీకు పిటిరియాసిస్ ఆల్బా అనే అనే చర్మ సమస్య ఉంది . దీనికి ప్రత్యేకం గా ఇదీ కారణం అని చెప్పలేం కాని , సున్నితమైన చర్మం గలవారికి ఈ చలి సీజన్‌ లో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. చలికాలమే అయినా సూర్యకిరణాల తాకిడి ప్రభావం కూడా ఉంటుంది.
pityriasis alba - పిటిరియాసిస్ ఆల్బా : common form of pityriasis (usually in children or young adults) characterized by round patches of depigmentation .

నివారణ : ఆహారము లో విటమిన్‌ " ఏ" లోపించినా ఇటువంటి సమస్యలు వస్తాయి. పడుకునే ముందు తెల్ల మచ్చల మీద " హైడ్రోకార్టిసాన్‌" ఒక శాతము గల్ క్రీము అప్లై చేయండి. పగటివేళ spf 30 గ సన్‌స్క్రీన్‌ లోషన్‌ ను రాయండి . క్యారెట్ , చిలకడదుంప , పాలకూర , పాలు , గుడ్లు  వంటి ఆహారము తీసుకోవాలి .

 *===========================

 visit my website - > Dr.Seshagirirao-MBBS -

ఊబకాయము లో గర్భము దాల్చే అవకాశము

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
 ప్ర : నా వయసు 30 సం.లు ...గర్భము కోసము ప్రయత్నిస్తున్నాను . బరువు 80 కిలోలు . ఈ బరువు ప్రభావము గర్భము పై ఏమైనా ఉంటుందా? .

జ : స్థూలకాయం వల్ల తల్లికి , బిడ్డకి కూడా హాని జరుగుతుంది. మామూలుగా కూడా స్థూలకాయులు గర్భం దాల్చడం కొంచెం కష్టమవుతుంది. హైపర్ టెన్సన్‌ , జెస్టేషనల్ డయబెటీస్ వంటి వాటికి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ తెలుసుకొని భయపడాల్చిన అవసరము లేదు. గర్భము దాల్చే ప్రయత్నాలకు ముందే వైద్యురాల్ని సంప్రదించి సర్రియైన నిర్ణయము తీసుకోండి . బరువు తగ్గే పరత్నాలు ముందుగా చేయండి . ఎన్నో రకాల జిమ్‌ సెంటర్లు , హెల్త్ కేర్ సెంటర్లు అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో బరువు తగ్గడమనేది అంత సమస్యకాదు . లక్ష్యం ప్రధానము గా ఉంటే చాలు .

  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Tuesday, August 5, 2014

గోళ్లు పెళుసుబారకుండా సూచనలు ఇవ్వండి ?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

Q :  గోళ్లు పెళుసుబారకుండా సూచనలు ఇవ్వండి ?

    Ans : చాలామంది ముఖం అందంగా కనిపించేందుకు తీసుకునే శ్రద్ధ చేతులపై చూపరు. ముఖ్యంగా గోళ్లపైన. అవి పెళుసుబారి, బలహీనంగా, నల్లగా మారి పోతాయి.గోళ్ళు బలహీనముగా , ఫెళుసుగా ఉన్నట్లైతే తరచూ చిట్లిపోతుంటాయి. గోళ్ళ ఆరోగ్యము కోసము విటమిన్‌ " సి " , కాల్సియం ఉన్న పధార్ధము లు తినాలి .
అలా కాకూడదంటే..

గాలి ఆడనివ్వాలి: గోళ్లకు స్వచ్ఛమైన గాలి అందాలి కాబట్టి.. అప్పుడప్పుడు గోళ్లరంగు వేయడం మానేయండి. సెల్‌ఫోన్‌లో తరచూ మెసేజ్‌లు టైప్‌ చేసేవాళ్లు.. కంప్యూటర్‌లో పనిచేసేవాళ్లను ఎప్పటికప్పుడు మంచి షేప్‌లో కత్తిరించండి.

తేమతో అందం: చర్మంతోబాటు గోటికీ తగినంత తేమ అందుతూనే ఉండాలి. తీవ్ర రసాయనాలతో కూడిన జెల్‌లూ, క్రీములతో తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం మానండి. చేతికి వాడే మాయిశ్చరైజింగ్‌ క్రీమునే గోళ్లకీ రోజూ పట్టిస్తే సరిపోతుంది.

బలాన్నిచ్చే పాలిష్‌లు: గోళ్లకు అవసరమైన ఖనిజాలూ.. విటమిన్‌లూ అందించే పాలిష్‌లూ ఇప్పుడు మార్కెట్‌లో ఉన్నాయి. వాటినే ఎంచుకోండి. అసిటోన్‌ వంటి కఠిన రసాయనాల మోతాదు ఎక్కువగా ఉన్న నెయిల్‌ పాలిష్‌ రిమూవర్‌లు అసలు వాడొద్దు.

మర్దన చేయండి: రెండుమూడు రోజులకోసారి గోళ్లకు గోరువెచ్చని బాదంనూనె రాసి మర్దన చేయండి. లేదంటే రెండు కప్పుల్లో గోరువెచ్చని ఆలివ్‌నూనెను సగం వరకూ తీసుకుని, నాలుగైదు చుక్కల నిమ్మరసం వేసి అందులో గోళ్లను ఉంచండి. కాసేపయ్యాక చేతుల్ని తీసేస్తే సరిపోతుంది.

మూలము : ఈనాడు వసుందర దినిపత్రిక - మే-2014
 *===========================

visit my website - > Dr.Seshagirirao-MBBS -

Monday, August 4, 2014

Howlong to feed breatmilk?,పిల్లలకు స్తన్యం-తల్లిపాలు ఎంతకాలము ఇవ్వాలి .

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
 ప్ర : Howlong to feed breatmilk?,పిల్లలకు స్తన్యం-తల్లిపాలు ఎంతకాలము ఇవ్వాల?.

జ : పాపాయిలకు పాలివాడాన్ని ఎంత వయసులో ఆపాలి అన్నది నిర్ధిస్టము గా చెప్పలేము . ఇది తల్లీ , పిల్లల ఆరోగ్య స్థితిగతులను బట్టి వుంటుంది. సాధారణముగా బిడ్డ ఘనపదార్ధాలను తీసుకోవడము ఆరంభించాక అంటే దాదాపు 6 నెలలు వయసు  నుంచి  స్థన్యం పాలు ఇవ్వడము తగ్గించవచ్చును . ప్రసవం తర్వాత తొలిరోజుల్లో రొమ్ముపాలలో " కోలోస్ట్రమ్‌" అనే పదార్ధము ఉంటుంది. దీనిలో ఎన్నోకీలక రోగనిరోధక శక్తిపెంచే పదార్ధాలు ఉంటాయి. 6 నెలలు పాటు తల్లిపాలు తాగే బిడ్డలలో ఇన్‌ఫెక్షన్‌ ను తట్టుకునే శక్తి పెరుగుతుంది. పిల్లలకు ఆర్నెల్లు తర్వాత తల్లిపాలునుండి లభించే ఐరన్‌  సరిపోదు . . ఈ వయసులో ఘనపదార్ధాలు తినిపించడము ప్రారంభించాలి.

ఇఒందరు తల్లులు ఎంకాలము  అయినా పాలివ్వడానీ ఎంజాయ్ చేస్తారు. . . అయితే పిల్లలకు 4 ఏళ్ళు వచ్చేవరకూ పాలివ్వడము సమణ్జసము కాదు . ప్రపంచ ఆరోగ్య సంస్థ  2 ఏళ్ళు వయసు వచ్చేవరకూ తల్లిపాలు చాలని సూచిస్తుంది.

  •  *=========================== 

visit my website - > Dr.Seshagirirao-MBBS -

Milk sustitutes.,పాలు -ప్రత్యామ్నాయాలు తెలియజేయండి?

  •  

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : పాలు -ప్రత్యామ్నాయాలు తెలియజేయండి?,Milk sustitutes.

జ : ప్రపంచ వ్యాప్తం గా బిడ్దకు ఇచ్చే తొలి ఆహారము పాలు . పిల్లల పెరుగు దలకు పాలు చాలా అవసరము . పాలు తాగడము ఇష్టపడ్ని పిల్లలకు ప్రత్యామ్నాయ ఆహారపదార్ధాలు ఇవ్వాలి . వారికి పెరుగు , చీజ్ , పన్నిర్ , మజ్జిగ వంటి పాలు ఆధారిత పద్దర్ధాలతో పాటు గుడ్లు , చేపలు , చికెన్‌ , జింజ ధాన్యాలు , సోయాబీన్లు , బఠాణీలు వంటివి అధికం గా ఇవ్వాలి.

పాలు లేదా క్షీరము (Milk) శ్రేష్ఠమయిన బలవర్ధక ఆహారము. ఇందులో అన్ని రకాలైన పోషక విలువలు ఉన్నాయి. కొద్దిగా విటమిన్ సి, ఇనుము తక్కువ. అన్ని వయసులవారూ తీసుకోదగ్గ ఉత్తమ ఆహార పదార్ధము. పాలను ఉత్పత్తి చేసే జంతువులు ఆవులు, గేదెలు, మేకలు మరియు గొర్రెలు. హిందువులు పవిత్రంగా పూజించే ఆవు యొక్క పాలు అన్ని రకాల పూజా కార్యక్రమాలలోనూ వాడతారు.

పోషక విలువలు
    కొవ్వు పదార్దాలు 4 %,
    పిండి పదార్ధాలు ('కార్బోహైడ్రేట్‌'లు) - 4.7 %,
    మాంసకృత్తులు ('ప్రోటీన్‌'లు) - 3.3 %,
    నీరు - 88 %,

మనిషి పాలలో 71 కిలో కేలరీలు , ఆవు పాలలో 69 కిలోకేలరీలు, గేదె పాలలో 100 కిలో కేలరీలు మరియు మేక పాలలో 66 కిలో కేలరీలు శక్తి ఉంటుంది.

*===========================

visit my website - > Dr.Seshagirirao-MBBS -

Friday, August 1, 2014

ఖాళీ కడుపుతో ఉదయాన్నే సొరకాయ(ఆనపకాయ)రసము తాగడము వల్ల బరువు తగ్గుతారా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : ఖాళీ కడుపుతో ఉదయాన్నే సొరకాయ(ఆనపకాయ)రసము తాగడము వల్ల బరువు తగ్గుతారా?

జ : బరువు తగ్గుతారో లేదో గాని పచ్చి రసాలు పరగడుపున తాగితే గాస్ట్రిక్ ప్రోబ్లం వచ్చే అవకాశము ఉంటుంది . సొరకాయ బరువు తగ్గించడము లో సహకరిస్తుందనడానికి క్లినికల్ పరిశోధనలైతే లేవు . కొద్ది పాటి కిలోలు బరువు తగ్గాలనే ప్లాన్‌ చేసుకుంటున్నప్పుడైతే నిస్సంశయముగా సొర ఆరోగ్యవంతమయిన వెజిటబుల్ . దీనిలో 96.1 శాతము నీరు ఉంటుంది. 100 గ్రాముల సర్వింగ్ లో కేవలము 12 క్యాలరీలు శక్తి మాత్రమే ఉంటుంది. ఇందులో పీచు ఎక్కువగా ను , ' సి' విటమిన్‌ , బి. కాంప్లెక్ష్ , ఐరన్‌ , సోడియం , పొటాషియం అధికముగా ఉంటాయి కాబట్టి ఆకలిని తగ్గించును .

  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -