Sunday, June 22, 2014

Any bad by frequent nail polishing?,తరచూ వేస్తే గోళ్ళ రంగు వలన నస్తముందా ?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : నాకు నెయిల్ ఆర్ట్ అంటే ఇస్టము .తరచూ వేస్తుంటే రష్టమా?
జ :నెయిల్ ఆర్ట్ లో వాడే నెయిల్ పాలిష్ లో  ఎసెటోన్‌ , ఎథైల్ లాక్టేట్ , టెరప్తాలిక్ యాసిడ్ వంటి అనేక రసాయనాలుంటాయి. గోళ్ళు.. నెయిల్ పాలిష్ లోని పిగ్మెంట్స్ ను గ్రహిస్త్రాయి. . . కాబట్టి నెయిల్ ఆర్ట్ చేస్తున్నప్పుడు డార్క్ కలర్ నెయిల్ పాలిష్ వాడకండి . దీనివల్ల గోళ్ళపై ఎక్కువగా మరకలు పడతాయి. ట్రాన్‌స్పరెంట్  నెయిల్ పాలిష్ ఒక కోట్ అప్లైయ్ చేసి  ఆ తర్వాత మాత్రమే గోళ్ళపై డార్క్ కలర్ నెయిల్ పాలిష్ వేయండి . ఆహారములో కాల్సియం , ఎ -విటమిన్‌ , జింక్ ఉండేటట్లు చూసుకోండి .

కఠినమైన గోళ్ళ పాలిష రిమూవర్లు వాడకూడదు. . . ఇవి చేతి వేళ్ళ గోళ్ళను పొడిబారేటట్లు  చేస్తాయి.  కెరోటిన్‌ కోట్స్ కు హానిచేస్తాయి.

  • *===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -

మార్జువానా(గంజాయి)ఉపయోగిస్తే మెమరీ తగ్గిపోతుందా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 ప్ర : మార్జువానా(గంజాయి)ఉపయోగిస్తే మెమరీ తగ్గిపోతుందా?  

జ : మార్జువానా ...(గంజాయిని  అలాగే పిలుస్తారు) --గంజాయి Cannabaceae కుటుంబానికి చెందిన వార్షిక ఔషధ మొక్క. ప్రజలు అనేక అవసరముల కోసం చరిత్రలో అన్ని చోట్ల గంజాయిని సాగు చేసారనడానికి ఆధారాలున్నాయి.

పారిశ్రామిక అవసరముల కొరకు నారను, విత్తనముల నుండి నూనెను, ఆహారంను, మందుల తయారి కొరకు ఈ గంజాయి మొక్కను ఉపయోగించారు.

మానసిక, శారీరక ఒత్తిడుల నుండి ఉపసమనాన్ని పొందడానికి ఈ మొక్క యొక్క వివిధ భాగాలను వివిధ ప్రదేశాలలో వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు.

ఈ గంజాయి మొక్క 5 నుంచి 8 అడుగుల ఎత్తు పెరుగుతుంది. దీని శాస్త్రీయ నామం Cannabis sativa. ఇది పుష్పించినపుడు విపరీతమైన వాసన చాలా దూరం (అర కిలోమీటరు) వరకు వస్తుంది.

గంజాయి మొక్క మనదేశానికి సుపరిచితం.పూర్వకాలంలో recreational గా హక్కలో వాడేవారు. ధనవంతులు,రాజులు,సామంతులు-స్త్రీలు,పురుషులు కూడా హక్కపీచ్చేవారు.గంజాయిని మెక్సికో దేశంలో మార్జువానా అంటారు. గంజాయిలో 84 cannabinoid drugs ఉన్నాయట. కెనాబిడయాల్,కెనాబినాల్,టెట్రా హైడ్రో కెనాబినాల్ వంటి psycho active పదార్ధాలున్నాయి.అందుకనే గంజాయి పేల్చేవారికి Tension తగ్గటం, మనస్సు తేలిక పడటం,ఆ హ్లదకరంగా feel అవ్వటం ఇత్యాది భావనలు వస్తాయి.మోతాదు ఎక్కువైతే నోరుతడారి పోవటం,కళ్ళు ఎర్రబారటం,హుస్వకాలపు మతిమరుపు ,భయం ఇత్యాది సమస్యలు వస్తాయి.గంజాయి అలవాటైతే వదలనే వదలదని అభిప్రాయం,అనుభవంతో చెప్పిన మాట ఇంతకుముందు జోగులు,సన్యాసులు,బైరాగులు గంజాయి పీల్చేవారు.గంజాయి పీల్చి సంగీతం వింటుంటే ఆ ఆనందమే వేరనేవారు కవులు కూడా. మొత్తం మీద దీన దుష్ర్టభావాలను గ్రహించి 20వ శతాబ్డంలో గంజాయి వాడకాన్ని నిషేధించారు.

ఇటీవల కొంతమంది వైద్యులు ఏమంటున్నారంటే,గంజాయి దుర్గుణాలు గంజాయికి ఉన్న మాట నిజమే కాని ఔషధలక్షణాలు కూడా ఉన్నాయి .గంజయి మొక్కలో మొత్తం 483 కాంపౌండ్స్ ఉన్నాయి.వాటిల్లో 84 కెవాబినాయిడ్స్ ఉన్నాయి.కొన్ని వైద్యంలో పనికి వస్తాయి అంటున్నారు.ఉదాహరణకు cancer treatment తీసుకుంటే chemotherapy వలన ఆకలి చచ్చిపొతుంది; వికారంగా,వాంతి చేసుకుందా మన్నట్లుగా ఉంటుంది.దీనికి గంజాలు మంచి వైద్యం.ఆస్మా(ఉబ్బసం)లో, depression లో కూడా బాగా పనిచేస్తుందని అంటున్నారు. Dronabinol వంటి మందుల్ని గంజాయి నుంచే తీస్తారు.కాని,దుర్లక్షణాలు తక్కువేమీ కావు కాబట్టి నిషేధాన్ని అట్లాగే ఉండనివ్వాలని నిపుణులు అంటున్నారు.


మాదకద్రవ్యాల్లో ఒకటైన మార్జువానాను ఉపయోగిస్తే అనేక ఆరోగ్య సమస్యలు పరిష్కరించబడతాయని ప్రాచీన కాలం నుంచి జనం నమ్మకం. అయితే మార్జువానాను ఔషధంగా మోతాదుకు మించి ఉపయోగిస్తే మనుషుల్లో జ్ఞాపక శక్తి నశిస్తుందని, మెదడు పనిచేసే తీరులో అసాధారణ మార్పులు వస్తాయని తాజా పరిశోధనల చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా స్కిజోప్రెనిక్ మానసిక వ్యాధిగ్రస్తులైన వ్యక్తులలో కనిపించే లక్షణాలు మార్జువానాను సేవించే వారిలో కనిపిస్తాయని చెప్పారు.

స్కిజోప్రేనియా బులెటిన్ అనే జర్నల్‌లో ప్రచురించిన ఒక వ్యాసం ఈ దిగ్బ్రాంతికరమైన విషయాన్ని బయటపెట్టింది. మానసిక వ్యాధిగ్రస్తులలో కనిపించే తీవ్ర లక్షణాలకు మార్జువానా కారణమవుతోందని అధ్యయనంలో తేలడం ఇదే మొదటిసారి. అమెరికా లో కొన్ని రాస్ట్రాలలో స్వేచ్ఛావిప ణిలో గంజాయి అమ్మకాలు జరగడం కారణంగా నేరాలు పెరిగే వీలుందని భయాందో ళనలు చెందుతున్నవాళ్లూ లేకపోలేదు

గంజాయి శరీర ఆరోగ్యానికి మంచిదేనని కొందరూ, కాదని మరికొందరూ సిగపట్టు పడుతున్న అమెరికాలో పరిశోధన చేస్తున్నారు. మన సాధువులు గంజాయి దమ్ము పట్టిస్తూ, సామూహికంగా అనుభవిస్తూ, అది ముక్తి మార్గానికి సన్నిహితమని నమ్మారు. రానురాను గంజాయి పండించడం, తాగడం, అమ్మడం ప్రపంచవ్యాప్తంగా నేరం కింద ప్రకటించారు. అయినా దొంగచాటుగా పండిస్తూ, వ్యాపారం సాగిస్తున్నారు.

  • *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Tuesday, June 10, 2014

అందమైన చర్మానికి ఏ ఆహారం తీసుకోవాలి ?

  •  



ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము

   Q : అందమైన చర్మానికి ఏ ఆహారం తీసుకోవాలి ?.

జవాబు : ఆరోగ్యం కోసమే కాదు.. అందం కోసమూ చక్కని ఆహారం తీసుకోక తప్పదంటున్నారు నిపుణులు. అందంగా కనిపించాలంటే చర్మం ఆరోగ్యంగా ఉండాలి. మన ఆరోగ్యానికి తొలి సూచిక చర్మమే. చర్మం మంచి నిగారింపుతో ఆరోగ్యంగా ఉండటానికి లోషన్లు, క్రీములు, పౌడర్ల వంటవేమీ పనిచేయవు. అవి పైపై మెరుగులే. సరైన పోషకాహారం తీసుకోకపోతే.. మన శరీరంలో మొదటగా ప్రభావితమయ్యేది చర్మమే.

మొటిమలు
కొవ్వు పదార్థాలు, ఫాస్ట్‌ఫుడ్‌, వేపుళ్లు ఎక్కువగా తింటే మొటిమలు ఎక్కువవుతాయి. తాజాపండ్లు, కూరగాయలు, నీరు బాగా తాగటం ద్వారా మొటిమల్ని తగ్గించుకోవచ్చు. ఒత్తిడి కూడా చర్మంపై ప్రభావం చూపించి మొటిమలు రావటానికి కారణమవుతుంది. అందుకని, శుభ్రత పాటించటంతో పాటు యాంటీఆక్సిడెంట్లు దండిగా ఉండే ఆహార పదార్థాల్ని ఎక్కువగా తీసుకోవాలి. గ్రీన్‌టీ, పొద్దుతిరుగుడు గింజలు, స్ట్రాబెర్రీ, దానిమ్మ వంటివాటిలో యాంటీఆక్సిడెంట్లు బాగా లభిస్తాయి.

వృద్ధాప్యం లో : 
వయసు మీదపడిన కొద్దీ చర్మం మృదుత్వాన్నీ, నిగారింపును కోల్పోతూ సాగిపోతుంటుంది. సన్నని గీతలూ, మడతలూ వచ్చి చేరుతుంటాయి. మానసిక ఒత్తిడులు, ఎండలో ఎక్కువగా తిరగటం వంటివన్నీ ఇలాంటి వృద్ధాప్య ఛాయల్ని పెంచుతాయి. విటమిన్‌సీని సరిపడినంతగా తీసుకోవటం ద్వారా మడతల్ని తగ్గించుకోవచ్చు. ఒమెగా-3, 6 కొవ్వు ఆమ్లాలు తీసుకోవటం ద్వారా కోల్పోయిన చర్మ నిగారింపును పొందవచ్చు. చేపల్లో ఇలాంటి కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. సాఫ్లవర్‌ నూనె, ముడి ధాన్యాలు, అవిసె గింజల్లో ఒమెగా ఆమ్లాలు లభ్యమవుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్‌-సి, ఇ ల్లో లభ్యమయ్యే యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని నివారిస్తాయి. నిమ్మ జాతి పండ్లను తినటం ద్వారా విటమిన్‌సీని సమృద్ధిగా పొందవచ్చు. ఆలివ్‌ నూనె, నూనె గింజలు, పాల కూర వంటివాటిలో విటమిన్‌-ఇ లభ్యమవుతుంది.

పొడిబారి, పొట్టులేచే చర్మం :
మీకు పొడి చర్మం ఉన్నట్లయితే క్యారట్లు బాగా తినాలి. విటమిన్‌-ఎ, బిలు పొడిబారి పొట్టులేచే చర్మానికి బాగా పనిచేస్తాయి. క్యారెట్లు, చేప నూనె, పాల ఉత్పత్తుల్లో విటమిన్‌-ఎ లభిస్తుంది.ఇక సూర్యరశ్మి సోకినప్పుడు మన చర్మమే విటమిన్‌-బిని ఉత్పత్తి చేసుకుంటుంది.

కళ్ల కింద చారలు :
కళ్ల చుట్టూ ఉండే చర్మం బాగా సున్నితంగా ఉంటుంది. ఈ భాగంలో కొవ్వు తక్కువగా ఉంటుంది. రక్తనాళాలు సమృద్ధిగా ఉండి, డ్రైనేజీ వ్యవస్థ తక్కువగా ఉంటుంది. దీనివల్ల దెబ్బతినే ముప్పు ఎక్కువ. కళ్ల చుట్టూ చర్మంపై నల్లని వలయాలు లేకుండా, మెరిసే చర్మం కోసం విటమిన్‌-కె సమృద్ధిగా తీసుకోవాలి. ఇది మాంసాహార పదార్థాలు, ఆకుకూరల్లో బాగా దొరుకుతుంది.

 తప్పనిసరి తినవలసినవి ..
చర్మ ఆరోగ్యానికి మాంసకృత్తులు, ఇనుము, జింకు, దండిగా నీరు అవసరం. ప్రొటీన్లు చర్మం ఆరోగ్యకరంగా కనిపించేందుకు తోడ్పడతాయి. పాల ఉత్పత్తులు, కొవ్వు తక్కువుండే మాంసాహారం, పప్పులు వంటి వాటి నుంచి అవసరమైన ప్రొటీన్లు పొందాలి. ఇనుము కోసం పాలకూర తినాలి. ఖనిజాల కోసం బెల్లం తినొచ్చు. చేపల్లో జింకు బాగా లభ్యమవుతుంది. రోజూ కాసింత అల్లం తిన్నా జింకు లభిస్తుంది. చర్మం ఎప్పటికప్పుడు పోషక నష్టాన్ని పూడ్చుకోవటానికి జింకు అవసరం. తృణ ధాన్యాలు, గుడ్లు, వెల్లుల్లి వంటివాటిలో లభించే సెలీనియం కూడా బాగా ఉపకరిస్తుంది.

తినకూడనివి :
సమతుల పోషకాహారం చర్మ నిగారింపుకు తోడ్పడుతుంది. కానీ.. పొగతాగినా, మద్యం తాగినా ఈ ప్రయోజనాలేవీ అందవు. ధూమపానం చర్మంలోని కొల్లాజెన్‌ను దెబ్బతీస్తూ, వృద్ధాప్య ఛాయలు ముంచుకొచ్చేలా చేస్తుంది. పొగతాగే వారిలో నోటిచుట్టూ సన్నని గీతల్లాంటివి ఏర్పడతాయి. వీటిని 'స్మోకర్స్‌ లైన్స్‌' అంటారు. ఆల్కహాలు తాగే వారు సాధారణంగా ఆహారం గురించి పట్టించుకోరు. ఇది చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదముంది. 

. *===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Friday, June 6, 2014

జ్ఞాపకశక్తికి నేరేడు పండ్లు మంచి చేస్తాయా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర ;  జ్ఞాపకశక్తికి నేరేడు పండ్లు మంచి చేస్తాయా?
జ : జ్ఞాపకశక్తిని మెరుగు పరచుకోవాలనుకుంటే నేరేడు పండ్లు తినమని సూచిస్తున్నారు పరిశోధకులు. సీజన్‌ను బట్టి ప్రతిరోజూ కొన్నైనా నేరేడు పండ్లు తింటే జ్ఞాపకశక్తిలో గణనీయమైన మెరుగుదల ఉంటున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. నేరేడులో ఉండే ''ఫ్లేవనాయిడ్స్‌'' అనే రసాయనాలు నాడీకణాలతో అనుసంధానమై మెదడు కణాల్ని ప్రేరేపిస్తాయి. దీనివల్ల స్వల్ప, దీర్ఘకాల జ్ఞాపకాలన్నీ మెరుగుపడే అవకాశం ఉంటుందని పరిశోధకులు వివరించారు. ఈ అధ్యయనంలో వెల్లడైన అంశాల ఆధారంగా భవిష్యత్తులో ఆల్జీమర్స్‌కు చికిత్స అందించే అవకాశం ఉందని రీడింగ్‌ యూనివర్సిటీ పరిశోధకులు జెరేమీ స్పెన్సెర్‌ పేర్కొన్నారు.
  • *===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

మన చర్మానికి టమాటా రక్షణ ఎలా కలుగజేస్తుంది? .


  •  
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .



సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాల కారణంగా మన చర్మం నల్లబారకుండా కాపాడుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం.. మన చర్మాన్ని కాపాడే రక్షక పదార్థం టమోటాల్లో ఉందని శాస్త్ర ప్రపంచం ఇప్పుడిప్పుడే నమ్ముతోంది. ఈ దిశగా పరిశోధనలు సాగుతున్నాయి. ఈ విషయంలో టమోటాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌- లైకోపేన్‌ చాలా ప్రభావశాలి. పాశ్చాత్య ఆహారంలో 85 శాతం లైకోపేన్‌.. టమోటాల నుంచి వచ్చేదే. టమోటా గుజ్జులో ఇది అత్యధికంగా లభ్యమవుతుంది. దీనివల్ల చర్మం నల్లబారే లక్షణం బాగా తగ్గుతోందని పరిశోధకులు భావిస్తున్నారు. కాబట్టి మామూలుగా ఆహార పదార్థాల్లో టమోటాల వినియోగం పెంచుకోవాలి. దీనివల్ల ప్రత్యేకమైన శ్రమ లేకుండానే మన చర్మాన్ని అతినీలలోహిత కిరణాల బారి నుంచి కాపాడుకోవచ్చు.
  • *=========================== 

visit my website - > Dr.Seshagirirao-MBBS -

Tuesday, June 3, 2014

నేను ఒక్కపొడి ఎక్కువగా తింటుంటాను . ఆరోగ్యరీత్యా నష్టమేమైనా ఉండా?


  •  
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
 Q : నేను ఒక్కపొడి ఎక్కువగా తింటుంటాను . ఆరోగ్యరీత్యా నష్టమేమైనా ఉండా?
జవాబు : ఓ వక్కను నోట్లో వేసుకుని  మధ్యలో మధ్యలో చప్పరించడము వల్ల బరువు త్గ్గడములో పరోక్షము గా సహకరిస్తుందని చాలా మంది భావిస్తుంటారు. కాని అది అపోహ మాత్రమే . తమల పాకుల్లో వేసుకునే వక్కపొడి అయినా , పూర్తిష్థాయి వక్క అయినా బరువు తగ్గడము లో ఏమాత్రము ఉపయోగపడదు.  అదే పనిగా బీటల్ నట్  నమలడము వల్ల అనారోగ్యాలు ఎన్నో కలుగుతాయి.
వక్కలు చెడు గుణాలు   :-

  • వక్కలలో ఆల్కలాయిడ్స్ , టానిన్లు శాతము ఎక్కువగా ఉంటాయి.ఇవి ఆరోగ్యానికి హానికరము .
  • అంతేకాకుండా తరచుగా వక్కలు - ఆకులు కలిపి తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి హానికరమని , కాన్సర్లు రావడానికి కారణం అవుతాయని నిపుణులు అంటారు. Due local irritation , 
  • అదేపనిగా నమలడము వలన 'మతిమరుపు' వచ్చే అవకాశము ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. 
  • వక్కలు , వక్కపొడి గర్భిణిలు,బాలింతలు  తీసుకోకూడదు . బిడ్డకు ,తల్లికి దుష్పరిణామాలు కలిగే ప్రమాదము ఉంది. 
  • 18 సం.లు లోపు వారు వీటిని ఎక్కువగా తీసుకోకూడదు . రక్తము విరిగిపోయే(blood dyscariasis)ప్రమాదము లేకపోలేదు. 
  • ఒక రకమైన మత్తును , హాయిని కలిస్తాయి కనుకనే వీటిని బానిసలయ్యే (adict) ప్రమాదము లేకపోలేదు. 

సుగుణాలు : అందరూ  భయపడినట్లు వక్కలు ఆరోగ్యానికి హానికరము కాదు వీటిలో సుగుణాలూ ఉన్నాయి.
  • పొట్టలో చేరిన లద్దెపురుగులు(round worms) , నులిపురుగులు(pin worms) నాశనము చేస్తాయి. 
  • నోటి దుర్వాశన ను పోగొడతాయి , 
  • దీనిలోని " ఎరికోలిన్‌ " అనే పదార్ధము మెదడును ప్రబావితం చేస్తుంది ... ఉత్సాహాన్ని కలిగిస్తుంది . హాలహాలు , కెఫిన్‌ ల తరువాత మానసిక ప్రేరేపిత పదార్ధము గా దీన్ని చెబుతారు. 
  • గుండె జబ్బులతో బాధపడేవారికి దీనిలోని " యాంటీ ఇన్‌ఫ్లమేటరీ " గుణాలు కొంతవరకు మేలు చేస్తాయి. 
  • మత్స్య కారులు ' ఆక్టోపస్ ' వలన కలిగే పుండ్ల కు మందుగా వాడుతారు.
  • సెల్యులార్ డీజనరేషన్‌ ను అడ్డుకునే శక్తి వక్కలలోని యాంటీఆక్షిడెంట్లకు ఉన్నది. 
  • స్కిజోఫ్రినియా (మానసిక వ్యాది )నుంచి విముక్తి పొందడానికి వక్కలు పనిచేస్తాయని కొన్ని పరిశోధనల వలన వెళ్ళడైనది. 

*===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Friday, May 16, 2014

Do pregnent woman apply color-dye to grayhair?, నేను 6 వారాల గర్భవతిని . తెల్లజుట్టు చాలా ఉంది తలకి కరల్ వేయవచ్చా?

  •  
  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

Q : నేను 6 వారాల గర్భవతిని . తెల్లజుట్టు  చాలా ఉంది ---తలకి కరల్ వేయవచ్చా?

Ans : ఇటీవల పరిశోధనలలో గర్భవతి చుట్టూ కాలుష్యము లోపల బిడ్దపై ప్రబావాన్ని చూపుతుంది అని  గుర్తించారు . ముఖ్యము గా 12 వారాల లోపు కడుపులోని బిడ్డకు ,
జుట్టుకు కలరింగ్ అనేది రసాయన ట్రీట్ మెంట్...  కాబట్టి వీలయినంత వరకు తెల్ల జుట్టుకు కలర్ వేయకపోవడము (మూడు - నాలుగు నెలలు నిండే దాక ) మంచిది . మార్కెట్ లో లబించే హెన్నాలో రసాయనాలు కలుపుతారు . ఇంట్లో తయారు చేసుకునే స్వచ్చమైన గోరింట పొడి సురక్షితమైనది . ఇదైనా తొలి మూడు నెలలు తరువాత వాడండి  .

*===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Which is good for health out of available OliveOils?,అందుబాటులోగల అనేక ఆలివ్ ఆయిల్స్ లో ఏది నాణ్యమైనదో తెలుసు కోవడం ఏలా?

ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 Q : Which is good for health out of available OliveOils?,అందుబాటులోగల అనేక ఆలివ్ ఆయిల్స్ లో ఏది నాణ్యమైనదో తెలుసు కోవడం ఏలా? 


*జవాబు :
 ప్రస్తుతం ప్రపంచమంతటా ఆరోగ్య పరిరక్షణకు , దీర్ఘకాలము ఆనందముగా జీవించడానికి ఏది మంచో , ఏది చెడో అన్న ఆలోచనలతో మానవ మేధస్సు ఎక్కువ ఆలోచిస్తోంది . నూనెలలో మంచిది ఆలివ్ ఆయిల్ . ఒకవిధమైన సీమచెట్టు, దాని యొక్క పండు , దానివిత్తులలోనుంచి నూనె తీస్తారు, నేతికి సమానమైనది. ఆలివ్ విత్తనాల నుండి ఆలివ్ నూనె తీస్తారు. ఇతర నూనెలకన్నా ఖరీదు ఎక్కువే అయినా ఆలివ్ నూనె లో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి . దీనిలో మోనో అన్క్ష్ సాచ్యురేటెడ్ కొవ్వు ఆమ్లాలు అత్యధికము.

ఆలివ్ నూనె లో Extra-Virgin , virgin , pure , Extra Light అని నాలుగు రకాలుగా దొరుకుతుంది . అందులో మొదటిది ( ఎక్స్ ట్రా వర్జిన్‌ ఆలివ్ ఆయిల్ ) మంచిది .  లేబుల్ పై వీటిని ఎక్ష్ ట్రా వర్జిన్‌ గా ముద్రుస్తారు. వీటిని కోల్డ్ ప్రెస్ట్  గా కూడా పేర్కొంటారు . . . ఈ  ఆయిల్ సీడ్స్ ను వేడిచెయ్యరు . మామూలుగా నూనెలజీవితకాలాన్ని పెంచడానికికి విగతా రిఫైండ్ ఆయిల్స్ అన్నింటినీ వేడిచేసతారు . వేడి చేయని ఈ ఆలివ్ ఆయిల్ ను కెమికల్ గా ట్రీట్ చెయ్యరు .

రిఫైండ్ రకాన్ని సింపుల్ గా ఆలివ్ ఆయిల్  అంటారు . దీనిని ఎక్ష్ట్రా వర్జిన్‌ తో కలుపుతారు " పామాస్ " అనేది తుది వెలికితీత . దీనికి హైస్మోక్ పాయింట్ వున్నప్పటికీ ఎక్కువగా హీట్ చెయ్యవద్దు . వేడి చెయ్యడము వల్ల దానిలో యాంటీ ఆక్షిడెంట్స్ నశిస్తాయి . మోనో అన్సాచురేటెడ్ ప్యాటీయాసిడ్స్ గల ఆలివ్ ఆయిల్ ఏ రూపము లోనిదైనా గుండెకు మంచిది .

  • ===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -

Sunday, April 6, 2014

Sun rays necessary for health?, ఆరోగ్యానికి సూర్యకాంతి అవసరమా?

  •  


  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

ప్ర : మంచి ఆరోగ్యానికి సూర్యకాంతి అవసరమా?

జ : మనిషి ఆరోగ్యానికి సూర్యకాంతి అవసరమే . ఎండతాకితే ఎక్కడ కమిలి పోతామోనన్న భయముతో సూర్యకిరణాలు తగలకుండా ఏదో ఒకటి అడ్డువేసుకుంటుంటాము .సూర్యకిరణాల తాకిడికి చర్మము కందిపోతుందన్న ఆలోచనలో పడి , రోజూ శరీరానికి కొద్దిపాటి ఎండ సోకడం అవసరమన్న సంగతినే పూర్తిగా విస్మరించేస్తున్నాము . మన దేశములో అత్యధిక సంఖ్యలో విటమిన్‌ డి లోపము తో ఉన్నారు. విదేశాలలో " సన్‌ బాతింగ్ " సంస్కృతి ఉంది. కాని మనం మాత్రం సూర్యుడి తీక్షణత అంటే భయపడిపోతున్నాము. ప్రతిరోజూ 15 -20 నిముషాలు సూర్యునికి ఎక్ష్పోజ్ అవడము చాలా ముఖ్యము . సూర్యకిరణాలనుండి శరీరానికి అవసరమైన విటమిన్‌ ' డి ' ని సమకూర్చుకుంటుంది.

సూర్యకాంతి సోకడము వల్ల ఎముక పటిష్టత మెరుగుపడుతుంది. ముఖ్యముగా పట్టణాలలో నివసించే భారతీయులు అసలు ఎండలోకి వెళ్ళడానికి ఇష్టపడరు . సూర్యరశ్మి సోకితే ట్యాన్‌ వస్తుందన్న భయము ఉన్నవారు ' సన్‌ స్క్రీన్‌ ' అప్లై చేసుకోవచ్చు . అయితే ఎండ తగిలే వేళల విషయములో జాగ్రత్తగా ఉండాలి . ఇది చాలా ముఖ్యము కూడా. ఉదయము 10 గం. నుండి మద్యాహ్నము 2 గం.ల వరకూ సూర్యుని అతినీలలోహిత కిరిణాలు తీక్షణము ఎక్కువగా ఉంటుంది. . కాబట్టి ఆ సమయాలలో చర్మానికి హాని జరుగుతుంది. ఉదయం 10 గం.ల లోపు , మధ్యాహ్నము 2 గం.ల తరువాత ఎండలోకి వెళ్ళి కనీషము పావుగంట  సేపైనా సూర్యకాంతి శరీరానికి  తగలినివ్వాలి .

 దీనివల్ల
  • -- ఎముకల ఆరోగ్యము బాగుంటుంది. 
  • -- నిద్ర క్వాలిటీ పెరుగుతుంది . 
  • -- జీర్ణశక్తి మెరుగవుతుంది. 
  • -- జీవక్రియ బాగుంటుంది. 
  • -- రోగనిరోధక శక్తి పటిస్టముగా ఉంటుంది. 
  • -- రక్టపోటు తగ్గుతుంది. 
  • -- డిప్రషన్‌ వంటి మానసిక రుగ్మతలు తగ్గుతాయి. 

  • ===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

Friday, April 4, 2014

What is Tatoo? is there any bad to us?,టాట్టూ అంటే ఏంటి? వాటివలన మనకు నష్టమేమైనా ఉందా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .


Q : What is Tatoo? is there any bad to us?,టాట్టూ అంటే ఏంటి? వాటివలన మనకు నష్టమేమైనా ఉందా?

Ans : పచ్చబొట్లు (Tattoos) చర్మం మీద వేయించుకొనే ఒకరకమైన చిహ్నాలు. దీనిలో వివిధ వర్ణపదార్ధాలను సన్నని సూదుల ద్వారా గుచ్చి వేస్తారు. మనుషులలో ఇవి వారివారి అభిరుచులను
బట్టి వేయించుకొనే గుర్తులు. జంతువులలో వీనిని ఎక్కువగా గుర్తించడానికి వీలుగా పెంచుకోనేవారు వేయిస్తారు.

టాట్టూ అంటే తెలుగులో మనం పల్లెటూర్లలో చిన్నప్పుడు వేయించుకునే పచ్చబోట్టు లాంటిదన్నమాట. కానీ టాట్టూ అనేది ఇప్పుడు చాలా పెద్ద ప్యాషన్ అయిపోయింది. ఒక్కసారి మనం మన శరీరం మీద టాట్టూ వేయించుకుంటే కొన్ని రకాల టాట్టూలు చెరిగిపోతాయి, మరికొన్ని రకాల టాట్టూలు చెరిగిపోవు. పచ్చబొట్టు పాతమాట. టాట్టూ అనేది కొత్త బాట. ఈ కాలంలో ఇదో వేలం వెర్రి. చేతిమీదా ఛాతీమీదా ఒళ్లంతా టాట్టూ వేయించుకని సంబరపడే వారి సంఖ్య పెరుగుతోంది. ఎవరిష్టం వాళ్లది. టాటూలు ఉన్నప్పుడు ఎం.ఆర్.ఐ స్కాన్‌ తీయించుకుంటే ఇబ్బందులు తప్పనిసరిగా వస్తాయన్నది నానుడిలో ఉన్నది. టాటూ ఇంకు రేడియేషన్‌ కు రియాక్టయి ,చర్మం వాపులు వస్తాయని చాలామంది భయపడుతుంటారు ... దీనిలో కొంత నిజము లేకపోలేదు. తగం లో టాటూ ఇంకులో మెర్కురీ వంటి మెటల్స్ ఉండేవని ఒక అభిప్రాయము . కాని ఈ రోజుల్లో " ఐరన్‌ ఆక్షైడ్ సాల్ట్'' వంటి సురక్షితమైన పిగ్మెంట్స్ వాడుతున్నారు. ఇవి రియాక్ట్ కావు .క్లోరినేటెడ్  స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్ళడము వల్ల టాటూ కలర్ ఫేడ్ అవుతుందని మరో అపోహ ... క్లోరిన్‌ చర్మం తొలి లేయర్ లోకి చొచ్చుకొనిపోదు ... కాబట్టి కలర్స్ ఫేడ్ అయ్యే ప్రసక్తే లేదు.

పచ్చబొట్లు పొడిపించుకోవడం అత్యంత పురాతనమైన కళ . ఒక వ్యక్తి శరీరంలోని చర్మాన్ని సూదితో గుచ్చి రంగులను, వర్ణాలను దానిపై వేయటమనే ఈ కళ కొన్ని తెగలకు సంప్రదాయంగా వస్తున్నది. నేడు పశ్చిమ దేశాల్లో ఇది ఒక ఫ్యాషన్ . భారత దేశానికి కూడా విస్తరించింది. మానవ శరీరాన్ని ఒక నారగుడ్డగా ఉపయోగించుకోవటమే పచ్చబొట్టు పొడిపించుకోవడం అనవచ్చు. ఈ ప్రక్రియకు స్ఫూర్తి ప్రాచీన కాలపు పచ్చబొట్లే. గతంలో ఈ రంగు నల్లగా (నూనెను కాల్చినపుడు వచ్చే మసి) ఉండేది. దీన్ని అవిసె నూనెలో కానీ లేదా పసుపు ముద్దలో కానీ మూలికలతో సహా కలిపి వేసేవారు. ప్రస్తుతం ఈ రంగుల ప్రత్యామ్నాయాలకు బదులు మాసిపోని సిరా వచ్చింది. ఇవి రుద్దినా పోదు. రంధ్రాలలో రంగులను చొప్పించేందుకు ఉపయోగించిన బాధాకరమైన ముల్లుకు బదులుగా విద్యుత్ శక్తిసంపన్నమైన సూది వచ్చింది. ప్రాచీన ఈజిప్టు నాగరికతంత పురాతనమైనది ఈ పచ్చబొట్టు. 4000 ఏళ్ళనాటి ఈజిప్టియన్ మమ్మీలకు నైట్ దేవత చిహ్నాలైన పచ్చబొట్లు ఉన్నాయి. ప్రాచీన గ్రీకులలో పచ్చబొట్టు కులీనులకు మాత్రమే ప్రత్యేకించబడింది. వార్తాహరుల నున్నటి బోడిగుండ్లపైన పచ్చబొట్లు చెక్కి సంకేత సందేశాలు గ్రీకులు పంపేవారు. ప్రాచీన రోమన్లు బానిసలకు, నేరస్థులకు పచ్చబొట్లు గుర్తులుగా చేసేవారు. 7వ శతాబ్ది ఏ.డి. ప్రాంతాలలో పచ్చబొట్లు ఏ మతాన్నీ నమ్మనివారు చేసేపనిగా పరిగణించి కొన్ని శ్డతాబ్దాల వరకు యూరప్‌లో నిషేధించారు. కానీ ఇది ఇతర చోట్ల కొనసాగుతూ వచ్చింది. కాలక్రమేణా ప్రపంచమంతటా ప్రజాదరణకు పాత్రమైంది.భారతదేశంలో ప్రాచీన కాలం నుంచీ పచ్చబొట్ల కళ పరిఢవిల్లింది. యుద్ధవీరులు, మల్లయోధులు తమ పటుత్వం కల నరాలపై, మణికట్లపై హనుమంతుడు, కత్తులు, త్రిశూలం మొదలైన రూపాలతో పచ్చబొట్లు పొడిపించుకునేవారు.

కొన్ని వైద్య పరమైన విషయాలలోనూ పచ్చబొట్లు వైద్యులు తప్పనిసరిగా వేస్తున్నారు. ఉదాహరణకు ఒక శస్త్రచికిత్స తరువాత రొమ్ములు తొలగించడం జరిగినే, చనుమోనల ఆకారాన్ని కల్పించేందుకు పచ్చబొట్టు ను వాడటం. మరి కొన్ని దేశాల్లో వ్యక్తి శాశ్వత రుగ్మత తో బాధపడుతుంటే (ఉదాహరణకు మధుమేహం) ఆ రుగ్మత గురించి పచ్చబొట్టు వేయడం. దీంతో ప్రమాదంలో వ్యక్తి అపస్మారక స్థితిలో వెళ్లిపోతే అతని రుగ్మత గురించి వెంటనే తెలుస్తుందనే భావనతో పచ్చబొట్టు వేస్తున్నారు.

 ఇక పచ్చబొట్లు రెండు రకాలు – శాశ్వతమైనవి ఒక రకం అయితే, తాత్కాలికమైనవి రెండో రకం. పచ్చబొట్టు వేయించుకునే విషయం లో కొన్ని జాగ్రత్తలు:

    పచ్చబొట్టు ఎటువంటిదైనా అనుభవజ్ఞులైన వారిచేత వెయిచుకునేటట్లు చూసుకోండి.
    పచ్చబొట్టు పొడిచేందుకు వినియోగించే పనిముట్లు, సూదులు శుద్ధమై, ఆరోగ్యారీత్యా తగినవైనవిగా ఉండేటట్లు చూసుకోండి. లేకుంటే భయంకర అంటువ్యాధులు ప్రబలవచ్చు. లేకుంటే కొన్ని శాశ్వత చర్మ వ్యాధులు శోకగలవు.
    నిపుణులైన పచ్చబొట్లు వేసే వారు వాడే పచ్చబొట్టు యంత్రాన్ని పూర్తిగా శుభ్రం చేసెట్టు చూసుకొని, సూదులు క్రొత్తవి వాడేందుకు కోరండి. అవసరమైతే మీ ముందే సూదులు శుభ్రం చేసేందుకు, మార్చేందుకు కోరండి.
    శాశ్వత పచ్చబొట్టు వేసేందుకు మీ శరీర చర్మానికి రంధ్రాలు చేయాలని గుర్తించండి. దీని మూలంగా రక్తం కూడా ప్రవహిస్తుందని గమనించండి. అందుకోసం పచ్చబొట్టు వేసే ప్రదేశం ఆసుపత్రితో సమానంగా ఉండేటట్లు చూసుకోండి.
    పచ్చబొట్టు పొడిచే వారికి సరైన లైసెన్స్ లు ఉన్నాయా లేదా అని గమనించండి.
    మీరు అనారోగ్యంతో ఉంటే పచ్చబొట్టు పొడిపించుకోకండి.
    పచ్చబొట్టు వేసేటప్పుడు ఎటువంటి మధ్యపానం, మత్తు పదార్ధాలను సేవించకండి.
    మీ పచ్చబొట్టు లో వినియోగించిన రంగు, రసాయనాలు, వేసిన వారి పేరు అన్నీ వ్రాసి పెట్టుకోండి. మునుముందు ఎటువంటి ఆరోగ్యకర సమస్యలు తలెత్తినా ఈ వివరాలు తప్పక అవసరం అని గమనించండి.

మరో ముఖ్యవిషయం ఏమిటంటే – పచ్చబొట్టు శాశ్వతమైనదైనా, లేదా తాత్కాలికమైనదైనా ప్రమాదాలకు దారితీస్తుందని గుర్తించండి. అపరిశుభ్ర సూదులు, పరికరాలు వాడితే ఎయిడ్స్,
హెపటైటిస్ వంటి ప్రమాదకర వ్యాధులు సోకుతాయని గమనించండి. అంతే కాకుండా నాసి రకం రంగులు వాడటం మూలంగా వీటి ప్రభావం మీ కాలేయం, రక్తం, కళ్ళకు ప్రమాదం కల్గించగలదని గుర్తించండి.

ఇక పచ్చబొట్లను తొలగించడం సులభమే కానీ అన్నీ ప్రయత్నాలలో ఇది సఫలితాలను ఇవ్వడాని గుర్తించండి. మీ శరీర చర్మాన్ని బట్టి పచ్చబొట్టు 100 శాతం తొలగించబడవచ్చు లేదా కొద్ది శాతం మేర తొలగిపోవచ్చని గుర్తుంచుకోండి. అలానే పచ్చబొట్టు తొలగించే ప్రక్రియలోనూ పైన పేర్కొన్న వ్యాధుల తాలూకు ప్రమాదాలు పొంచిఉన్నాయనే సత్యాన్ని గమనించండి.

పచ్చబొట్టు తొలగించే ముందు వైద్యుడిని సంప్రదించండి. ఒక్కో సమయంలో ప్రమాదకర చర్మ సంభందిత లక్షణాలు రావచ్చు. దీని కారణంగా తీవ్రమైన బాధ, శాశ్వత రోగం బారిన పడే అవకాశం
లేకపోలేదు.

  •  *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -